ఇక్కడ ఒక కేటుగాడు ఇలాంటిదే చేయబోయి చివరికి దొరికిపోయాడు. ఉత్తరప్రదేశ్లోని ఖుషి నగర్ లో కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా బట్టతలను దాచేందుకు విగ్గు పెట్టుకుని మేనేజ్ చేసిన వరుడు.. చివరికి దొరికిపోయాడు. తబ్రేజ్ ఆలం అనే వ్యక్తి తన పేరును ఆర్యన్ ప్రసాద్ గా మార్చుకుని.. పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నట్లు ఒక మహిళకు అబద్ధం చెప్పాడు. ఇక మాయమాటలు చెప్పి ఆ మహిళతో సంవత్సరం పాటు రిలేషన్ షిప్ లో ఉన్నాడు. ఇక ఈ జంట వివాహం చేసుకోవాలని ప్రతిపాదనకు మహిళ కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకున్నారు.
ఇకపోతే ఇటీవలే పెళ్లి ముహూర్తం రానే వచ్చింది. అప్పటికే తబ్రేజ్ అబద్ధాలు అన్ని బట్టబయలు అయ్యాయి. వధువు కుటుంబ సభ్యులు పెళ్లి కోసం అన్ని సిద్ధం చేశారు. ఇక పెళ్లి తంతు మరికొద్ది సేపట్లో ప్రారంభమవుతుంది అని అనుకుంటున్నా సమయంలో తబ్రేజ్ నుంచి ఫోన్ వచ్చింది. తన తల్లికి గుండెపోటు వచ్చిందని పెళ్లికి తమ కుటుంబ సభ్యులు ఊరేగింపుగా వచ్చే అవకాశం లేదని మహిళ కుటుంబీకులకు చెప్పాడు. ఆ తర్వాత తబ్రేజ్ అలంకరించిన కారులో వివాహ వేదిక వద్దకు వచ్చాడు. అయితే నగలు విషయంలో ఒక వివాదం మొదలవగా.. అంతలోనే తబ్రేజ్ తలపై ఉన్న విగ్ ఊడిపోయింది. దీంతో అక్కడున్న వారందరూ షాక్ అయ్యారు. వెంటనే అతని అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించడంతో పోలీసులు అసలు నిజాన్ని తేల్చారు.