దీంతో ఎలాంటి ఆరోగ్య సమస్యతో హాస్పిటల్ కి వెళ్లిన ఆయా పేషెంట్లు డాక్టర్లకు కొత్తగా ఏం అనిపించదు అని చెప్పాలి. కానీ ఎంతో అనుభవం ఉన్న డాక్టర్లను సైతం అవాక్కయ్యలా చేసే కొన్ని కొన్ని ఘటనలు అప్పుడప్పుడు వెలుగులోకి వస్తూ ఉంటాయి. ఇక ఇలాంటి ఘటనలు ఏదైనా వెలుగులోకి వస్తే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే. ఏకంగా డాక్టర్లే ఆశ్చర్యపోయే ఒక కేసు వైద్యులకు ఎదురైంది.
వియత్నాం లో ఈ ఆశ్చర్యపోయే ఘటన వెలుగు లోకి వచ్చింది. ఒక 34 ఏళ్ళ రోగి తీవ్రమైన కడుపు తిమ్మిర్ల సమస్యతో ఆసుపత్రికి వచ్చాడు. ఈ క్రమంలోనే అతడికి అల్ట్రా సౌండ్, ఎక్స్ రే తీశారు వైద్యులు. అయితే రిపోర్టులు వచ్చిన తర్వాత చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే సదరు రోగి మలద్వారంలో ఏకంగా 30 సెంటీమీటర్ల బతికున్న చేప (లైవ్ ఈల్ )చిక్కుకున్నట్లు రిపోర్టులో గుర్తించారు వైద్యులు. దాని ఫలితంగానే రోగికి తిమ్మిర్ల సమస్య వచ్చిందని వైద్యులు తెల్చారు. వెంటనే సర్జరీ చేసి ఆ చేపను బయటకు తీశారు. అయితే ఆ జీవి పాయువు ద్వారా లోపలికి వెళ్లి ఉండవచ్చని వైద్యులు తెలిపారు.