ఎండాకాలం వచ్చిందంటే చాలు వేడి నుంచి ఉపశమనం పొందడానికి ఒక్కొక్కరు ఒక్కో పని చేస్తూ ఉంటారు. కొంతమంది ఏసీల ముందు కూర్చొని ఇక చల్లటి గాలిని ఆస్వాదిస్తూ మైమరిచిపోతూ ఉంటారు. ఇంకొంతమంది ఫ్యాన్ గాలికి బాగా అలవాటు పడతారు. మరి కొంతమంది ఏసీలు ఫ్యాన్లు కాకుండా ఇక చెట్టుకిందకు వెళ్లి నాచురల్ ఎయిర్ తో ఉపశమనం పొందాలని అనుకుంటారు. అయితే కొంతమంది ఈ వేసవిలో ఎక్కువగా  కొలనులు, చెరువుల్లో ఈతకు వెళ్లడం చేస్తూ ఉంటారు. ఇక నగరాల్లో అయితే స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి. కానీ గ్రామాల్లో బావులు కొలనులు చెరువులు లాంటివి మాత్రమే ఉంటాయి.


 దీంతో ఎండాకాలం వచ్చిందంటే చాలు యువకులు అందరూ కూడా ఉపశమనం కోసం ఇలా ఈతకు వెళ్తూ ఉంటారు అనే విషయం తెలిసిందే. అయితే కొన్ని కొన్ని సార్లు ఈతకు వెళ్ళినప్పుడు ప్రమాదాలు కూడా జరగడం చూస్తూ ఉంటాము. ఈతకు వెళ్లి నీట మునిగి ప్రాణాలు కోల్పోయిన ఘటనల గురించి కూడా ఇప్పటివరకు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా కని విని ఎరుగని ఘటన గురించే. ఏకంగా స్నేహితులతో కలిసి చెరువులో ఈతకు వెళ్ళాడు బాలుడు. కాగా అతనికి ఊహించని చేదు అనుభవం ఎదురయింది. ఏకంగా చెరువులో ఉండే చేప అతని గొంతులోకి వెళ్లి ఇరుక్కుపోయింది.


 ఈ విచిత్రకరమైన ఘటన ఛత్తీస్గడ్ లోని జాంబ్ గీర్ చాంపా ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది. అయితే 14 ఏళ్ల బాలుడు సమీర్ ఏకంగా గొంతులో చేప ఇరుక్కుపోవడంతో ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. వెంటనే మిగతా స్నేహితులు అతని స్థానిక ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు ఎంతో కష్టపడి సగం చేపను మాత్రమే బయటకు తీశారు. కాగా బాలుడి ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో వెంటనే పెద్ద ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే వైద్యులు అతని గొంతు దగ్గర ఆపరేషన్ చేసి ఇక చేపను బయటికి తీశారు. దీంతో ఆ యువకుడు ప్రాణాలతో బయటపడగలిగాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: