విధి ఆడిన వింత నాటకంలో మనుషుల జీవితాలు కేవలం కీలుబొమ్మల్లాంటివి మాత్రమే అని పెద్దలు చెబుతూ ఉంటారు ఎందుకంటే విధి ఎలా ఆడిస్తే.. మనిషి అలా ఆడతాడు. విధి ఎన్నాళ్లు బ్రతికించాలి అనుకుంటే.. అన్ని రోజులు మాత్రమే మనిషి మనుగడ సాగుతుంది అని అంటూ ఉంటారు. అయితే నేటి రోజుల్లో జనాలు ఇదంతా చాదస్తపు మాటలు అని కొట్టి పారేస్తున్న.. వెలుగులోకి వచ్చే కొన్ని ఘటనలు చూస్తే మాత్రం ఇది ముమ్మాటికి నిజం అనే భావన ప్రతి ఒక్కరిలో కూడా కలుగుతూ ఉంటుంది.


ఎందుకంటే అంతా సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో ఊహించని ఘటనలు ఎంతో మంది ప్రాణాలు పోవడానికి కారణం అవుతూ ఉంటాయి అని చెప్పాలి. ఇలా విధి కొంతమంది ప్రాణాలను తీస్తూ ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపుతూ ఉంటుంది. ఇక్కడ ఇలాంటి విషాదకర ఘటన జరిగింది  సాధారణంగా ప్రతి అమ్మాయి జీవితంలో పెళ్లి అనేది ఒక కల. నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుని  నూరేళ్లు సంతోషంగా ఉండాలని పెళ్లిపై  కోటి ఆశలు పెట్టుకుంటుంది ఆడపిల్ల. పుట్టింటి వారిని వదిలేసి మెట్టినింట్లో అడుగుపెట్టి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది. ఇలా ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంటే ఆమె ఆనందం మాటల్లో వర్ణించలేని విధంగా ఉంటుంది.


 కానీ ఇక్కడ ఒక నవ వధువుకు మాత్రం పెళ్లి జరిగింది అన్న ఆనందం కనీసం గంటలు కూడా లేకుండా పోయింది. ఎందుకంటే పెళ్లి చేసుకున్న కొన్ని గంటల్లోనే విధి ఆడిన నాటకంలో ఆ నవ వధువు చివరికి ప్రాణాలను విడిచింది. ఈ విషాదకర ఘటన ఏపీలో వెలుగులోకి వచ్చింది. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం దెబ్బగడ్డలో ఈ విషాదకర ఘటన జరిగింది. ఇటీవలే రాత్రి 10 గంటలకు ఓ యువకుడితో 20 ఏళ్ల అఖిలకు వివాహం జరిగింది. అయితే వివాహం పూర్తి అయిన తర్వాత నీరసంగా ఉంది అంటూ అఖిల నిద్రపోయింది. కాగా తర్వాత ఎంత పిలిచిన  లేవకపోవడంతో వెంటనే కంగారు పడిపోయిన తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించారు. అయితే పరీక్షించిన వైద్యులు అఖిల అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ లో మునిగిపోయారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: