అయితే వీరిద్దరి విడాకుల వ్యవహారం నిజమే అన్న విషయం ఆ తర్వాత బయటపడింది. ఏకంగా షోయబ్ మాలిక్ తన రెండో భార్య సానియా మీర్జాకు విడాకులు ఇచ్చి పాక్ నటిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో సానియా మీర్జా షోయన్ విడాకుల వ్యవహారం అధికారికంగా ప్రకటించినట్లు అయింది. ఇక ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో.. ఎన్నో రోజులపాటు హాట్ టాపిక్ గా మారిపోయింది. సర్లే ఏదో జరిగింది జరిగిపోయింది కనీసం మూడో భార్యతో అయినా షోయబ్ కలిసి ఉంటాడు అని అభిమానులు అనుకున్నారు.
కానీ ఇక ఇప్పుడు షోయబ్ మాలిక్ మరో అమ్మాయి వెంటపడుతున్నాడట. షోయబ్ మాలిక్ మూడో పెళ్లి చేసుకొని మూడు నెలలు కూడా కాకముందే.. మరో అమ్మాయి వెంట పడుతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. పాకిస్తాన్ ప్రముఖ నటి నవల్ సయ్యద్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు పెళ్లి అయిన క్రికెటర్ల నుంచి మెసేజ్లు వస్తున్నాయంటూ సమాధానం చెప్పగా.. మీరు షోయబ్ మాలిక్ గురించి మాట్లాడుతున్నారా అంటూ యాంకర్ ప్రశ్నించింది. దీంతో ఆమె నవ్వుతూ సమాధానం దాటవేశారు. ఆమె చెప్పింది షోయబ్ గురించేనని.. ఇక మూడో పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే నాలుగొ భార్యను కూడా షోయబ్ వెతుక్కోవడం మొదలుపెట్టాడు అంటూ అందరూ విమర్శలు చేస్తున్నారు.