పెళ్లి జరగకుండా ఒక అబ్బాయి అమ్మాయి ఒకచోటే ఉండడానికి అసలు అంగీకరించేవారు కాదు. కానీ ఇప్పుడు చట్టపరంగా అలా ఉండడం నేరం కాదు.. దీంతో నేటి రోజుల్లో యువత లివింగ్ రిలేషన్షిప్ పేరుతో ఇక ఒకే చోట నివసిస్తున్నారు. భార్యాభర్తల్లాగ శారీరక సంబంధం కూడా పెట్టుకుంటున్నారు. అయితే ఇలాంటి పాశ్చాత్య అలవాటు ఎన్నో అనర్ధాలకు కారణం అవుతుంది. మొదట సహజీవనంలో బ్రతుకుతున్న వారు ఆ తర్వాత ఇక ప్రేమించిన వారు మోసం చేయడంతో నడిరోడ్డున పడుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటివరకు ఎంతోమంది అమ్మాయిలు ఇలా సహజీవనం కారణంగా మోసపోయి కోర్టును ఆశ్రయించిన వారు ఉన్నారు.
అయితే ఇటీవల సహజీవనం విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు మాత్రం అందరిని అవాక్కయ్యేలా చేసింది. ఈ విషయం తెలిస్తే సహజీవనం చేసి మోసం చేయాలనుకునే ఎంతోమంది వెనకడుగు వేస్తారేమో. సహజీవనంలో ఉండే మహిళకు హక్కులను కల్పించే దిశగా మధ్యప్రదేశ్ హైకోర్టు కీలకతీర్ణం ఇచ్చింది. పెళ్లి చేసుకోకుండా మహిళతో సహా జీవనం చేసి విడిపోయిన తర్వాత.. ఆ మహిళ భరణం పొందేందుకు అర్హురాలి అంటూ తెలిపింది హైకోర్టు. వారి మధ్య బంధం రుజువైతే భరణాన్ని తిరస్కరించలేము అంటూ స్పష్టం చేసింది మధ్యప్రదేశ్ హైకోర్టు. సహజీవనం చేసి వేరుపడిన మహిళకు నెలకు 1500 భరణం ఇవ్వాలి అంటూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్ధించింది.