
మహిళపై ఆమె పొరుగంటి వ్యక్తి దాదాపు నెల రోజులపాటు అత్యాచారం చేసి చిత్రహింసలకు గురి చేశాడు. ఈ అమానవీయా ఘటన మధ్యప్రదేశ్లో వెలుగులోకి వచ్చింది. నిందితుడు తనను పెళ్లి చేసుకోవాలని తల్లిదండ్రుల ఆస్తిని తన పేరిట మార్చాలి అంటూ డిమాండ్ చేస్తూ ఇక ఇలా చిత్రహింసలకు గురి చేశాడు. తల్లితో కలిసి నివసిస్తున్న 23 ఏళ్ళ మహిళను నిర్బంధించి లైంగికంగా వేధించి చిత్రహింసలకు గురి చేశాడు అయితే నిందితుడు ఆమె గాయాలపై కారం పొడి చల్లి కేకలు వేయకుండా ఉండేందుకు ఆమె నోటిని టేప్ తో మూసి ఉంచాడు.
నిందితుడు తనను నెల క్రితం తన నివాసానికి తీసుకెళ్లడని.. అక్కడ గదిలో బంధించి కమ్యూనికేషన్ లేకుండా తప్పించుకునే మార్గాలు లేకుండా చేశాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది. ఇక అతను ఇంట్లో లేని సమయంలో ఎలాగోల ఇంటి నుంచి తప్పించుకున్న బాధితురాలు ఇక ఐదు కిలోమీటర్ల పాటు నడిచి పోలీస్ స్టేషన్కు చేరుకొని ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు ఆమె పరిస్థితి చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఒళ్లంతా గాయాలతో కళ్ళు ఉబ్బి ఇక పెదవులు మొత్తం జిగురుతో మూసి వేయబడినట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే ఆమెను దగ్గరలోని ఆసుపత్రిలో చేర్పించారు. అయితే అక్రమ మద్యం సరఫరా చేస్తున్న సమయంలో సదరు అత్యాచార నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.