గమ్యస్థానానికి వేగంగా చేరుకోవాలి అనే కంగారులో చివరికి ఎంతోమంది రోడ్డు ప్రమాదల బారిన పడుతున్నారు. అతివేగం ప్రమాదకరమని తెలిసిన కూడా ఇక తమ వాహనంలో వేగంగా వెళ్లడానికి ఇష్టపడుతున్నారు. కానీ వేగం కారణంగా ఇక వాహనం అదుపుతప్పి రోడ్డు ప్రమాదాల బారిన పడితే.. కొంతమంది కాళ్లు చేతుల విరిగిపోయి జీవచ్ఛవాలుగా మారిపోతుంటే.. ఇంకొంతమంది చివరికి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలా రోడ్డు ప్రమాదాల కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వస్తుంది. ఇటీవల సూర్యపేట జిల్లాలో కూడా ఇలాంటి తరహా ఘటనే వెలుగులోకి వచ్చింది.
ఏకంగా ఆ జిల్లాలో జరిగిన యాక్సిడెంట్లో హైదరాబాద్ వాసులు దుర్మరణం చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన నవీన్ రాజా భార్గవి దంపతులు ఉదయం 6 గంటల సమయంలో ఏపీకి బయలుదేరారు. అయితే నవీన్ విజయవాడలోనే శ్రీ చైతన్య కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్నాడు. సమయానికి కాలేజీకి చేరుకోవాలి అనే కంగారులో అతివేగంగా డ్రైవ్ చేసాడు. ఈ క్రమంలోనే మార్గమధ్యమంలో ఆగి ఉన్న కంటైనర్ను వారు ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టడంతో చివరికి ఇద్దరు దంపతులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుర్యోధన చేస్తున్నారు.