ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా పెంపుడు జంతువులను పెంచుకునే ట్రెండు కొనసాగుతుంది. ఒకప్పుడు కేవలం సంపన్నులు మాత్రమే భారీగా డబ్బులు ఖర్చు పెట్టి తమకు ఇష్టమైన పెంపుడు జంతువులని ఇంట్లోకి తెచ్చుకొని పెంచుకునేవారు. కానీ ఈ మధ్యకాలంలో మాత్రం ఇది ఒక ట్రెండ్ గా మారిపోయింది. దీంతో ఇక డబ్బులు లేకపోయినా సరే సామాన్యులు అప్పు చేసి మరి పెంపుడు జంతువులను తెచ్చుకోవడం చూస్తూ ఉన్నాం. ఇక ఇలా ఇంట్లోకి తెచ్చుకున్న పెంపుడు జంతువులను ఏకంగా మనుషుల కంటే ప్రేమగా చూసుకుంటూ ఉన్నవారు కూడా నేటి సభ్య సమాజంలో కనిపిస్తూ ఉన్నారు అని చెప్పాలి.


 అయితే ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఇలా పెంపుడు జంతువులని పెంచుకున్నారు. కొంతమంది కుక్కలని పెట్స్ గా  పెంచుకుంటుంటే.. ఇంకొంతమంది పిల్లులను ఇంట్లో పెంచుకుంటూ ఉండడం చూస్తూ ఉన్నాం  మరి కొంతమంది విచిత్రంగా ఏకంగా పాములను సింహాలను పెంచుకుంటూ ఉన్న విచిత్రమైన ట్రెండు కూడా నేటి రోజుల్లో కనిపిస్తుంది. అయితే ఇలా పెంపుడు జంతువులను జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక కుటుంబం ఎంతో ప్రేమగా ఒక పిల్లిని తెచ్చి పెంచుకుంటుంది. కానీ ఆ పిల్లి కారణంగా చివరికి వారి ఇల్లే తగలబడిపోయింది.



 చైనాలో ఈ విచిత్రకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ పెంపుడు పిల్లి ఇంటిని తగలబెట్టేసింది. నైరుతి చైనాలోని సించువాన్ ప్రావిన్స్ లో దండన్ అనే వ్యక్తి ఓ పిల్లిని తెచ్చుకొని ప్రేమగా పెంచుకుంటున్నాడు. దాని పేరు జిన్ గుడియావ్. అయితే ఆ పిల్లి వంట గదిలో ఆడుకుంటూ పొరపాటున ఇండక్షన్ కుక్కర్ టచ్ ప్యానెల్ పై అడుగుపెట్టగా స్టవ్ అంటుకొని వంటగది మొత్తం కాలిపోయింది.  దీంతో ఇది గమనించిన ఇంటి యజమాని వెంటనే అటు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేశారు  సిబ్బంది. కాగా తర్వాత క్యాబినెట్లో బూడిదలో కూడుకుపోయిన పిల్లిని గుర్తించారు అగ్నిమాపక సిబ్బంది.

మరింత సమాచారం తెలుసుకోండి: