ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే. సాధారణంగా ఒక చెప్పుల దుకాణం నడుపుతున్న వ్యాపారి దగ్గర డబ్బు ఎంత ఉంటుంది అంటే మహా అయితే కొన్ని లక్షల రూపాయలు ఉంటాయి అని సమాధానం చెబుతూ ఉంటారు ఎవరైనా. కానీ ఇక్కడ చెప్పులు కుట్టే వ్యాపారి మాత్రం చాలా రిచ్. రిచ్ అంటే అంతా ఇంతా కాదు. ఏకంగా పెద్ద పెద్ద వ్యాపారాలు చేసే వారికి సైతం ఉండనంత ఆస్తులు కలిగి ఉన్నాడు ఈ చెప్పుల వ్యాపారి. అతని ఆస్తుల వివరాలు తెలిసి ప్రతి ఒక్కరు కూడా ముక్కున వేలేసుకుంటారు అని చెప్పాలి.
ఎందుకంటే ఇటీవలే అతని ఇంట్లో ఐటి అధికారులు రైడ్స్ నిర్వహించగా 100 కోట్ల రూపాయల డబ్బును గుర్తించారు యూపీలో ఈ షాకింగ్ కట్టిన వెలుగులోకి వచ్చింది. ఓ చెప్పులు వ్యాపారింట్లో ఐటి అధికారులు 100 కోట్లు గుర్తించడం సంచలనంగా మారిపోయింది. ఆగ్రాలోని ముగ్గురు చెప్పుల వ్యాపారులకు చెందిన ఇల్లు ఆఫీసులపై ఐటీ దాడులు చేశారు అధికారులు అయితే మొత్తం 14 ప్రాంతాల్లో రెండు రోజులు సోదరులు నిర్వహించారు ఈ తనిఖీలలో ఓ వ్యాపారి ఇంట్లో 100 కోట్ల రూపాయలు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మంచాలు అల్మారాలు బ్యాగుల్లో నోట్ల కట్టాలను కుక్కారు. అయితే వాటిని లెక్కించేందుకు ఏకంగా క్యాష్ మెషిన్లు సైతం మొరాయించాయ్ అని చెప్పాలి.