ఈమధ్య వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత మనుషుల మధ్య మానవ సంబంధాలకు విలువ లేకుండా పోయింది అన్నది అర్థమవుతుంది. ఎందుకంటే ఒకప్పుడు కట్టుకున్న బంధానికి కన్న బంధానికి విలువ ఇచ్చేవారు మనుషులు. కానీ ఇప్పుడు ఆ విలువను ఇవ్వడం కూడా మానేశారు. ఏకంగా క్షణకాల సుఖం కోసం చేయకూడని నీచమైన పనులన్నీ చేసేస్తూ ఉన్నారు. అడవుల్లో ఉండే మృగాల కంటే అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు మనుషులు. మరీ ముఖ్యంగా నేటి రోజుల్లో కట్టుకున్న బంధాన్ని కాదని ఏకంగా పరాయి వాళ్ళు మోజులో పడిపోయి అక్రమ సంబంధానికి తరలింపుతున్నారు చాలామంది.


 అయితే ఇలాంటి అక్రమ సంబంధాల కారణంగా ఎంతో మంది ఏకంగా పచ్చటి కాపురంలో చిచ్చు పెట్టుకుంటున్నారు. ఇదే అక్రమ సంబంధాలు ఎంతోమంది హత్యలకు ఆత్మహత్యలకు కారణం అవుతున్నాయి అని చెప్పాలి. ఇంత జరుగుతున్న ఇన్ని వార్తలు తెర మీదికి వస్తున్న.. జనాల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. అయితే ఇక్కడ జరిగిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినదే. కానీ ఈ విషయం తెలిసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. సభ్య సమాజంలో శాంతిభద్రతలను కాపాడటమే కాదు.. ఇక అందరూ సక్రమంగా నడుచుకునేలా చూసుకుంటూ ఉంటారు పోలీసులు.


 ఎంతో బాధ్యతయుతంగా వ్యవహరిస్తూ ఉంటారు అని చెప్పాలి. సాధారణ కానిస్టేబులే ఇలా ఉంటే.. ఏకంగా డిఎస్పి స్థాయిలో ఉన్న పోలీస్ ఆఫీసర్ ఇంకెంత  బాధ్యతగా ఉండాలి.. కానీ ఇక్కడ ఒక పోలీస్ తన బాధ్యతను మరిచిపోయాడు. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ఆయన.. చివరికి నీచమైన పని చేశాడు. అక్రమ సంబంధం పెట్టుకొని చివరికి డిఎస్పీ నుంచి కానిస్టేబుల్ స్థాయికి డిమోషన్ పొందాడు. పోలీస్ శాఖలో అతను కానిస్టేబుల్ నుంచి డిఎస్పి స్థాయికి ఎదిగాడు. కానీ అతని వక్రబుద్ధి ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి మళ్ళీ వెళ్ళేలా చేసింది. యూపీ కి చెందిన అధికారి కృష్ణ శంకర్ మూడేళ్ల క్రితం ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అయితే దీనిపై అతని భార్య ఫిర్యాదు చేయగా.. ఇక రెడ్ హ్యాండెడ్గా పోలీసులు పట్టుకున్నారు. ఇక ఈ విషయంపై విచారణ జరపగా చివరికి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డీఎస్పీ నుంచి కానిస్టేబుల్ కి డెమోషన్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: