ఈ మధ్యకాలంలో మనిషి రోజుకు చెడు అలవాట్లకు దగ్గరవుతున్నాడు తప్ప.. ఎక్కడ దూరం కావడం లేదు. మరీ ముఖ్యంగా నేటి రోజుల్లో మద్యం అనేది మనిషి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది అని చెప్పా⁴లి. 5నీళ్లు తాగడం ఆహారం తీసుకోవడం ఎలా అయితే ఒక సాధారణ రోజువారి పనిగా మారిపోయిందో ఇక మద్యం తాగడం కూడా అలాగే మారిపోయింది అన్నది నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత అందరికీ అర్థమవుతుంది. అయితే మద్యం తాగితే ఆరోగ్యం పాడవుతుందన్న విషయం అందరికీ తెలుసు. కానీ ఎవరు కూడా ఈ విషయాన్ని పట్టించుకోవట్లేదు.


 అదే సమయంలో గతంలో మద్యం తాగిన వారిని కాస్త విచిత్రంగా చూసేవారు జనాలు. కానీ ఇప్పుడు మద్యం అలవాటు లేదు అని ఎవరైనా చెప్పారు అంటే చాలు ఏకంగా వేరే గ్రహం నుంచి వచ్చిన వింత మనిషిని చూసినట్లుగా అతని విచిత్రంగా చూడటం చూస్తూ ఉన్నాం. అంతలా లోకం తీరు మారిపోయింది. అయితే మద్యం కారణంగా ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్న మనుషుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. ఈ క్రమంలోనే మద్యం కారణంగా ప్రతి ఏడాది ఎంత మంది చనిపోతున్నారు అన్న విషయం హాట్ టాపిక్ గా మారిపోయింది.



 అయితే మద్యపానం కారణంగా ప్రతి సంవత్సరం ఏకంగా సుమారు 30 లక్షల మంది చనిపోతున్నారు అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలో తెలుపుతుంది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా మరణాల రేటు కాస్త తగినప్పటికీ అది ఆమోదించలేదు అంటూ పేర్కొంది. ప్రతి 20 మరణాల్లో ఒకటి మద్యపానం కారణంగానే సంభవిస్తుంది అంటూ చెప్పుకొచ్చింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. 2019లో ఆల్కహాల్ వినియోగం కారణంగా ఏకంగా 2.6 మిలియన్లమంది చనిపోగా అందులో మూడు వంతులు మంది అటు కేవలం పురుషులు మాత్రమే ఉండడం గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి: