ప్రస్తుత రోజుల్లో ప్రపంచం మొత్తం టెక్నాలజీ వెంట పరుగులు పెడుతుంది. ఈ క్రమం లోనే ఈ సరికొత్త టెక్నాలజీ మనిషి జీవన శైలిలో ఎన్నో మార్పులకు కారణమైంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పెరిగి పోయిన టెక్నాలజీ మీద అతిగా ఆధార పడుతున్న మనిషి ఇక ప్రతి పనిని కూడా సులభతరం చేసుకుంటున్నాడు. మరీ ముఖ్యం గా నేటి రోజుల్లో ఎక్కడికైనా కొత్త ప్రదేశాలకు వెళ్లాలి అనుకున్నప్పుడు ఈ టెక్నాలజీనే బాగా ఉపయోగపడుతుంది.


 ఒకప్పుడు కొత్త ప్రాంతాలకు వెళ్లాలి అనుకున్నప్పుడు ఇక రోడ్డు పక్కన ఎవరైనా కనిపిస్తే అడ్రస్ కనుక్కుంటూ వెళ్లే వాళ్ళు అందరూ. కానీ ఇప్పుడు అలా లేదు. ఎవరితో మాట్లాడాల్సిన అవసరమే లేకుండా పోయింది. అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లో గూగుల్ మ్యాప్ ఆన్ చేస్తే చాలు వెళ్లాల్సిన చోటికి ఎలా వెళ్లాలి అన్న విషయాన్ని చూపిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు కూడా గూగుల్ మ్యాప్ పైన ఆధారపడుతూ కొత్త ప్రదేశాలకు ప్రయాణాలు సాగిస్తూ ఉన్నారు. కానీ కొన్ని కొన్ని సార్లు గుడ్డిగా గూగుల్ మ్యాప్ ను నమ్మితే మాత్రం ప్రమాదాలు తప్పవు అని నిరూపించే ఘటనలు కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి.


 ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా కఠిన గురించి అని చెప్పాలి గూగుల్ మ్యాప్స్ ఒక్కోసారి చివరికి తప్పుదోవ పట్టిస్తుంది అన్నదానికి ఇక్కడ జరిగిన ఘటన నిదర్శనం. ఒడిస్సా లోని కొంతమంది విద్యార్థులు కు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. దేన్ కనాల్ జిల్లాలోని సప్తసాధ్య గుడికి వెళ్ళిన వారు తిరిగి వస్తూ గూగుల్ మ్యాప్స్ ఫాలో అయ్యారు దీంతో గూగుల్ మ్యాప్ వారిని ఏకంగా అడవిలోకి తీసుకువెళ్లడంతో దారి ఎటు వెళ్లాలో తెలియక 11 గంటలపాటు  అడవిలోనే అల్లాడిపోయారు చివరికి రెస్క్యూటివ్ వారిని వెతికి పట్టుకోవడంతో చివరికి బయటపడగలిగారు

మరింత సమాచారం తెలుసుకోండి: