ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద రైల్వే లైన్ కలిగిన దేశంగా ఇండియా కొనసాగుతోంది అన్న విషయం తెలిసిందే. భారత్ లో ఇలా రైలు మార్గాల ద్వారా లక్షలాది మంది ప్రయాణికులు ప్రతిరోజు కూడా తమ జర్నీని సాగీస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొంతమంది జీవితాలలో అయితే రైలు ప్రయాణం అనేది రోజువారి ఆర్టీసీ బస్సు ప్రయాణం లాంటిదే. కొంతమంది ఆర్టీసీ బస్సుల్లో ఎక్కి గమ్యస్థానాలకు ఎలా చేరుకుంటారో.. మరి కొంతమంది ఇక తమకు రైలు మార్గం అందుబాటులోకి ఉన్న నేపథ్యంలో ప్రతిరోజు రైలులోనే ప్రయాణిస్తూ ఉంటారు అని చెప్పాలి.


 అది సరేగాని ఇక ఇప్పుడు ఇలా రైలు గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది అంటారా.. సాధారణంగా రైలు ఒక్కసారి పరుగు అందుకున్న తర్వాత ఎక్కడ ఆగుతుంది అంటే సమీపంలో ఏదైనా రైల్వే స్టేషన్ వస్తే అక్కడ ఆగుతుంది. ప్రయాణికులు ఎక్కిన తర్వాత అక్కడ నుంచి మళ్లీ బయలుదేరుతుంది అని చెబుతారు ఎవరైనా. అయితే ఇలా స్టేషన్ లేని చోట రైలు అస్సలు ఆగదు. కానీ ఇక్కడ అలా కాదు. రైలు ప్రతిరోజు కూడా ఇక్కడ ఆగుతూనే ఉంటుంది. అయితే అక్కడ రైల్వే స్టేషన్ ఉండే ఉంటుంది. ఇంతకీ ఆ రైల్వే స్టేషన్ పేరు ఏంటి అంటారా. ఈ విషయం చెప్తే మాత్రం తప్పకుండా అవాక్కవ్వుతారు. ఆ ఎందుకంటే రైల్వే స్టేషన్ కు అసలు పేరే లేదు.


 అదేంటి బాసూ వినడానికే విచిత్రంగా ఉంది. పేరులేని రైల్వే స్టేషన్ ఏంటి. నేను ఎప్పుడు వినలేదు అనుకుంటున్నారు కదా. కానీ మీరు విన్నది నిజమే దేశంలో ఒక రైల్వే స్టేషన్ కు పేరు లేదనే విషయం చాలా మందికి తెలియదు. దానికి నేమ్ బోర్డు లేకపోయినా రైళ్లు అక్కడ రెగ్యులర్గా ఆగుతూనే ఉంటాయి. పశ్చిమ బెంగాల్ లోని రైనా అండ్ రైనా గడ్ అనే రెండు గ్రామాల మధ్య ఈ రైల్వే స్టేషన్ ఉంది. దీనికి రైనా గడ్ స్టేషన్ గా పేరు పెట్టారు. స్టేషన్ తమ భూభాగంలో ఉందని తమ ఊరి పేరు పెట్టాలని రైనా గ్రామస్తులు వాదిస్తున్నారు. ఈ వివాదం ముదరడంతో ఇక రైల్వే అధికారులు స్టేషన్ పేరును తొలగించారు. కానీ టికెట్ లో మాత్రం రైనా గడ్ అనే పేరు ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: