వర్షాకాలం మొదలైంది. ఇప్పటికే దేశంలోని కొన్ని రాష్ట్రాలలో అటు కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదలు కూడా వచ్చి విపత్కర పరిస్థితులు ఏర్పడుతున్నాయి అన్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా ఉత్తర భారతంలోని రాష్ట్రాలలో అయితే ఎడతెరిపిలేని వర్షాలతో ప్రజలందరూ కూడా అల్లాడిపోతున్నారు. అయితే ఉత్తరప్రదేశ్లో ఇలా వర్షాల కారణంగా ఏకంగా వరదలతో జనావాసాలు అస్తవ్యస్తంగా మారిపోతున్నాయ్ అన్న విషయం తెలిసిందే.


 అయితే ఇలా భారీ వర్షాల దెబ్బకు వరదలు వచ్చి చివరికి కొన్ని కొన్ని చోట్ల రోడ్లు కూడా పాడైపోయి.. భారీ గుంతలు ఏర్పడుతున్నాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు వర్షాల ప్రభావం కొన్ని రాష్ట్రాలలో ఎంత దారుణంగా ఉంది అనేదానికి నిదర్శనంగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఏకంగా చూస్తూ చూస్తుండగానే ఏకంగా తారు రోడ్డు మాయమైపోయింది.ఇది చూస్తే వర్షాలు పడినప్పుడు రోడ్లపై ప్రయాణించాలన్న భయం కలగక మానదు. ఎందుకంటే చూస్తూ చూస్తుండగానే అప్పటివరకు ఎంతో బలంగా కనిపించింది రోడ్డు కూడా కొట్టుకుపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది అని చెప్పాలి. యూపీలోనే ముజ్జుఫార్ నగర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.



 భారీ వర్షానికి వాగులు వంకలు పొంగి ప్రవహిస్తూ ఉండగ.. ఓచోట ఉధృతంగా ప్రవహిస్తున్న నీటి దాటికి రోడ్డు రెపపాటులో రెండుగా చీలిపోయింది. ఈ క్రమంలోనే ఇలా రోడ్డు కూలిపోయిన ప్రాంతంలో నీటి ప్రవాహం కనిపిస్తుంది. వైరల్ గా మారిన వీడియోలో కొందరు వాహనదారులు రోడ్డుకు ఇరువైపులా వాహనాలను నిలిపి ఉంచారు. ఒక వ్యక్తి రోడ్డుపై దృష్టి పెట్టి వీడియో తీయడం మొదలుపెట్టారు. అంతలో ఉన్నటువంటి రోడ్డు మధ్యలో ఒక భారీ గుంత ఏర్పడింది. ఒక రకంగా ఏకంగా రోడ్డు ఒక్క క్షణంలో ఎటువైపు  మాయమైందా అన్న రీతిలో ఏకంగా రోడ్డు కూలిపోయింది అని చెప్పాలి. ఇక ఎందుకు సంబంధించిన వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఇది వైరల్ గా మారిపోయింది. ఇది చూసి అందరు షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: