సాధారణంగా పేద ప్రజలందరికీ కూడా ఎంతో మేలు చేకూరే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో రకాల సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఆయా సంక్షేమ పథకాల ద్వారా నిరుపేద ప్రజలందరికీ కూడా ఆర్థిక సహాయం అందించడం లేదంటే మరో రూపంలో సహాయ సహకారాలు అందించడం చేస్తూ ఉంటాయి ప్రభుత్వాలు. ఈ క్రమంలోనే కేవలం అర్హులైన వారికి మాత్రమే ఇలాంటి పథకాలు వర్ధించేలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలనుంచి లబ్ధి పొందిన వారు ఈ పథకాల ద్వారా జరిగిన మేలు గురించి చెబుతూ ఉంటారు.


 ఇలా ఎంతోమంది సంక్షేమ పథకాలు పొంది లబ్ధి పొందాము అని చెప్పిన వీడియోలు సోషల్ మీడియాలో చాలానే వెలుగులోకి వస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మాత్రం ఒక విచిత్రమైన ఘటన గురించి. ఏకంగా ప్రధాన నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ఒక సంక్షేమ పథకం ఎన్నో కుటుంబాల్లో చిచ్చు పెట్టింది. అంతేకాదు ఎంతో మందికి మేలు చేయడం కాదు కీడు చేసింది అని చెప్పాలి. సంక్షేమ పథకం అంటున్నారు.. కీడు చేసింది అంటున్నారు. అలా ఎలా జరుగుతుంది అని కాస్త కన్ఫ్యూజన్లో పడిపోయారు కదా.. అయితే ఇక్కడ పథకం లబ్ధిదారులు చేసిన పని గురించి తెలిసి  ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతారు అని చెప్పాలి.


 ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మొదటి విడతగా ఏకంగా 40 వేల రూపాయలు అందుకున్న 11 మంది మహిళలు భర్తలను వదిలేసి తమ లవర్స్ తో వెళ్ళిపోయారు. యూపీలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మహారాజ్ గంజ్ జిల్లాలో జరిగింది. బాధిత భర్తలు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడంతో ఈ వ్యవహారం బయటికి వచ్చింది. జరిగిన విషయం తెలిసి ఏకంగా పోలీసుల సైతం షాక్ అయ్యారు. అయితే జరిగిన విషయం తెలుసుకున్న అధికారులు రెండో విడత డబ్బులను నిలిపివేసినట్లు తెలుస్తోంది. గత ఏడాది కూడా ఇలాగే 50వేల రూపాయలు తీసుకొని ఏకంగా ఇద్దరు మహిళలు తమ లవర్స్ తో పరారయ్యారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ap