ఈ మధ్యకాలంలో ట్రెండు పూర్తిగా మారిపోయింది   ఎంతలా అంటే ఒకప్పుడు ఆడా మగా కలిసి ఉండాలి అంటే కేవలం పెళ్లి బంధం ఒకటి ఉండాలి అని అనుకునేవారు అందరూ. పెళ్లి తర్వాత ఇలా ఆడ మగ కలిసి ఉండొచ్చు అని అందరూ నమ్మేవారు. కానీ నేటి రోజుల్లో పాశ్చాత్య దేశాల్లో కొనసాగుతున్న పోకడలకు మనదేశంలో కూడా ఎంతో మంది జనాలు అలవాటు పడిపోతున్నారు. దీంతో ఇక ఒకప్పటి సాంప్రదాయాలు కట్టుబాట్లు ఎక్కడ కనిపించడం లేదు. ఆడ మగ కలిసి ఉండాలంటే పెళ్లి కావాల్సిన అవసరం లేదు అని నేటి రోజుల్లో ఎంతోమంది యువత ఆలోచన తీరు మారిపోయింది అని చెప్పాలి.


 దీంతో నేటి రోజులు ఏకంగా పెళ్లి కాకుండా ఎంతో మంది యువతీ యువకులు ఒక ఇంట్లో కలిసి ఉంటున్నారు. భార్యాభర్తల్లాగానే శారీరక సంబంధం కూడా పెట్టుకుంటున్నారు. చివరికి ఇలాంటి బంధాలు ఎంతోమంది జీవితాలను రోడ్డుపాలు చేస్తూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. అయినప్పటికి యువత తీరులో మాత్రం మార్పు రావడం లేదు. చట్ట ప్రకారం సహజీవనం చేయడం నేరం కాదు అని.. ఇది తప్పు అని చెప్పిన వారికి ఎదురు మాట్లాడుతుండడం కూడా నేటి రోజుల్లో చూస్తూ ఉన్నాం. చివరికి తర్వాత ఇక నిండా మోసపోయాము అని భావించి కోర్టులను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య కూడా రోజురోజుకు పెరిగిపోతుంది.


 అయితే ఇక్కడ ఇలాంటి తరహా ఘటనకు సంబంధించి ఒక షాకింగ్ తీర్పును వెలువరించింది కోర్టు. సహజీవనం చేస్తున్న మహిళ తనపై పెట్టిన కేసును కొట్టివేయాలి అని కోరుతూ ఒక వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు ఒక వ్యక్తి. అయితే చట్టబద్ధంగా వివాహం కానప్పుడు భాగస్వామిపై 498ఏ కేసు పెట్టడం కుదరదు అంటూ ఇక ఈ పిటిషన్ పై విచారణ జరిపిన కేరళ హైకోర్టు కీలకమైన తీర్పును వెలువరించింది. అంతేకాకుండా సహజీవనంలో ఉండే భాగస్వామికి చట్టబద్ధంగా చేరిన పెళ్ళిలోని భాగస్వామికి మధ్య ఎంతో వ్యత్యాసం ఉంటుంది అంటూ కేరళ హైకోర్టు తెలిపింది. ఈ క్రమంలోనే తనపై సహజీవన భాగస్వామి అయిన మహిళ వేసిన కేసును కొట్టివేయాలంటూ అతను వేసిన పిటిషన్ విచారణ జరిపిన కోర్టు అతని నిర్దోషిగా తేల్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: