ఈ వీడియోలో పూరీలను సింపుల్, ఫాస్ట్ గా వత్తే టెక్నిక్ కనిపిస్తుంది. సాధారణంగా మహిళలు పూరీలను రోల్ చేయడానికి చాలా టైం తీసుకుంటారు కానీ ఇందులో చూపించిన టెక్నిక్ ప్రకారం పెద్దగా శ్రమ లేకుండా ఒకేసారి నాలుగైదు పూరీల ముద్దలను రోల్ చేయడం కుదురుతుంది. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ @ itz__ruchi షేర్ చేసిన ఈ వీడియోకు 4.4 కోట్ల వ్యూస్ వచ్చాయి. 5 లక్షల కంటే ఎక్కువ మంది లైక్స్ వచ్చాయి.
వైరల్ వీడియో ఓపెన్ చేస్తే ఒక కిచెన్ కనిపిస్తుంది. అందులో ఒక స్టవ్ ముందు బండపై ఓ మహిళ పూరి పిండి ముద్దలను పరచడం చూడవచ్చు. ఆమె పూరీలను రోలింగ్ స్టిక్ తో కాకుండా వెరైటీగా ఒత్తుతోంది. పిండిని ఓ కవర్ కింద పెట్టి దానిపై ఓ స్టీల్ ప్లేట్ తో గట్టిగా అదుముతోంది. ఆమె పెట్టిన ప్రెషర్ కారణంగా పిండి చక్కగా వత్తినట్టు గుండ్రంగా పూరీ ఆకారంలోకి వస్తుంది. అలా రెడీ అయిపోయిన పూరీ ఆకారపు పిండిని ఆమె వేడి వేడి నూనెలో వేస్తోంది. ఇంకేముంది చాలా త్వర త్వరగా పూరీలు తయారవుతున్నాయి. ఈ ట్రిక్ ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఒక వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఐడియా ఆడవారితో పాటు మగవారిని కూడా బాగా ఆకట్టుకుంటోంది.
ఇలాంటి ఒక హింట్ ఇస్తే చాలు పూరీ మేకింగ్ మెషిన్ కూడా అవసరం ఉండదు అని సరదాగా కొందరు కామెంట్లు చేశారు. ఈ ఐడియా బాగుందని కొందరు అంటే మరి కొందరు మహిళలు చాలా తెలివిగా ఆలోచిస్తారు అని కామెంట్లు చేశారు. దీనిని మీరు కూడా చూసేయండి.