ఈ మధ్యకాలంలో మనుషులపై ప్రకృతిలో ఉన్న అన్ని జంతువులు పగబడుతున్నాయా అంటే వెలుగులోకి వస్తున్న కొన్ని ఘటనలు చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా అవును అనే సమాధానమే చెబుతున్నారు. ఎందుకంటే మనుషుల మధ్య ఉంటూ మనుషుల మధ్య తిరిగే కొన్ని కొన్ని జంతువులు ఏకంగా మనుషులను చూస్తే చాలు బద్ధ శత్రువులను చూసినట్లుగా మీద పడి మరీ దాడులు చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఏకంగా కుక్కలు మనుషులపై ఎంత దారుణంగా దాడి చేస్తున్నాయో చూస్తూనే ఉన్నాం.


 ఇలా కుక్కల దాడిలో ఎంతోమంది అభం శుభం తెలియని చిన్నారులు సైతం ప్రాణాలుకోల్పోతున్నారు. ఎన్నో కుటుంబాలలో ఈ కుక్కల దాడులు విషాదనే నింపుతూ ఉన్నాయి అని చెప్పాలి. మొన్నటి వరకు ఇలా కుక్కలు దాడి చేస్తూ ఉంటే జనాలు అందరూ బెంబేలెత్తిపోయారు. ఇక ఇప్పుడు ఏకంగా కోతులు కూడా మనుషులపై దాడి చేయడం మొదలుపెట్టాయి. ఈ మధ్యకాలంలో అడవులను నరుకుతూ పెద్ద పెద్ద భవనాలను నిర్మిస్తున్న నేపథ్యంలో.  అడవుల్లో ఉండాల్సిన కోతులు అన్నీ కూడా జనావాసాల్లో తిరగేస్తూ ఉన్నాయి. దీంతో ఎంతో మందిని ఇబ్బందులకు గురి చేస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. ఇంట్లో వస్తువులను ధ్వంసం చేయడం అడ్డొచ్చిన వారిపై దాడి చేయడం లాంటి ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.


 అయితే ఇక్కడ ఇలాంటి తరహా ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. యూపీలోని మధురాలో ఓ ఐదేళ్ల బాలుడు పై కోతులు దారుణంగా దాడి చేసాయి. బాధితుడిని కిషన్ గా గుర్తించారు. బాలుడిపై కూతురు దాడి చేస్తుండగా.. అక్కడే ఉన్న మహిళలు భయపడి అక్కడి నుంచి పక్కకు పారిపోయారు. అయితే వెంటనే మరో వ్యక్తి వచ్చి కోతులను బెదరగొట్టడంతో బాలుడు చివరికి క్షేమంగా బయటపడ్డాడు. అయితే ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సిసిటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: