సాధారణంగా షాపింగ్ మాల్స్ కి వచ్చిన కస్టమర్ల పట్ల ఇక అక్కడి సిబ్బంది ఎంత మర్యాదపూర్వకంగా మెసులుకుంటారో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏం కావాలి మేడం.. ఏం తీసుకుంటారు అంటూ ఎంతో మర్యాదపూర్వకంగా  పలకరిస్తూ కావాల్సినవన్నీ కూడా చూపిస్తూ ఉంటారు . అయితే కొన్ని కొన్ని సార్లు కస్టమర్లు చిరాకు పడినా కూడా సిబ్బంది మాత్రం ఎంతో ఓపికగా సమాధానాలు చెప్పడం చూస్తూ ఉంటాం.


 ఇక్కడ జరిగిన ఘటన మాత్రం మరో కోవలోకి చెందినది. ఏకంగా షాపింగ్ కి వచ్చిన మహిళా కస్టమర్ ను దారుణంగా కొట్టారు సిబ్బంది. అంతేకాదు అందరి ముందే ఆ మహిళ కస్టమర్తో ప్యాంటు కూడా ఇప్పించారు అని చెప్పాలి. దీంతో ఇది కాస్త ప్రస్తుతం సంచలనంగా మారిపోయింది. అయితే ఇలా షాపింగ్ కి వచ్చిన కస్టమర్ ఫై చేయి చేసుకోవడమేంటి.. మరి దారుణంగా అందరి ముందే ఆమె ప్యాంట్ విప్పించడం ఏంటి అని షాక్ అవుతున్నారు కదా.. అయితే ఆ సదరు మహిళ కస్టమర్ చేసిన పని గురించి తెలిస్తే మాత్రం ఇక షాపింగ్ మాల్స్ సిబ్బంది సరైన పని చేశారు అనే భావన అందరికీ కలుగుతుంది. ఈ మధ్యకాలంలో దొంగతనాలు చేసే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. అయితే ఇలా చోరీలకు పాల్పడేందుకు ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటున్నారు.


 అయితే కేవలం మగవాళ్ళు మాత్రమే కాదు ఆడవాళ్లు కూడా ఇలా చేతివాటం ప్రదర్శిస్తూ ఉంటారు. కానీ కొన్ని కొన్ని సార్లు కాలం కలిసి రాక దొరికిపోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఒక యువతకి ఇలాంటి చేదు అనుభవం ఎదురయింది. ఓ అమ్మాయి షాపింగ్ కోసం ఒక వస్త్ర దుకాణానికి వెళ్ళింది. అయితే జీన్స్ ప్యాంట్ కావాలని కోరింది. టెస్టింగ్ కోసం కొన్ని జీన్స్ ప్యాంట్ లు తీసుకొని మెల్లిగా.. డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళింది. ఇక ఆ తర్వాత బయటకు వచ్చిన ఆ అమ్మాయి అసలు తనకు ఏ జీన్స్ పాయింట్ నచ్చలేదు అంటూ చెప్పి బయటికి వెళ్లిపోవడానికి ప్రయత్నించింది. కానీ అక్కడ సిబ్బంది అప్రమత్తంగా ఉండడంతో.. ఆమెతో పాయింట్ విప్పించారు. దీంతో ఏం జరుగుతుందో అర్థం కాకా.. ముందు అందరూ కంగు తిన్నారు. కానీ ఆ తర్వాత ఇక ఆ అమ్మాయి ఇలా రెండు మూడు జీన్స్ పాయింట్లు వేసుకుంది. ఇలా ప్యాంటు విప్పుతున్న కొద్ది ఇంకో పాయింట్ కనిపిస్తూనే ఉంది. దీంతో ఇది చూసి సిబ్బంది ఆమెపై చేయి కూడా చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: