సాధారణంగా కోతి నుండి మనిషి పుట్టాడు అని చెబుతూ ఉంటారు శాస్త్రవేత్తలు. ఇలా కాలక్రమేనా కోతి ఆకారంలో మార్పులు వచ్చి చివరికి మనిషి ఆకారంలోకి మారాడు అని అంటూ ఉంటారు. అయితే కోతికి ఉండే తోక కూడా మనిషిలో ఉంటుందని.. కానీ ఇప్పుడు మనిషి శరీరంలో ఆ తోక చిన్న సైజులో ఉంటుందని చెబుతూ ఉంటారు నిపుణులు. అయితే నేటి రోజుల్లో ఇక మనుషుల పోలికలు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. కానీ ఈ కాలంలో కూడా ఇంకా కోతుల లాగానే తోకతో పుట్టడం గురించి ఎప్పుడైనా విన్నారా.


ఇలాంటి ఘటన ఏదైనా జరిగింది అంటే అది సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా మారిపోతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో.. ఎక్కడ ఏం జరిగినా కూడా అది ఇంటర్నెట్లో వాలిపోతుంది. అయితే ఇక ఇప్పుడు ఇలాగే ఏకంగా తోకతో జన్మించిన ఒక బాలుడికి సంబంధించిన వార్త కూడా ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోయింది. ఈ విషయం గురించి తెలుసుకునేందుకు అందరూ ఆసక్తిని కనబరుస్తున్నారు అని చెప్పాలి. అయితే ఈ ఘటన ఎక్కడో కాదు ఏకంగా తెలంగాణలోని బీబీనగర్ లో ఉన్న ఎయిమ్స్ ఆసుపత్రిలో జరిగింది అని చెప్పాలి.


 ఏడాది క్రితం ఓ మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఈ బిడ్డ ఏకంగా తోకతో పుట్టడం గమనర్హం. దీంతో ఇది చూసి వైద్యులు సైతం షాక్ అయ్యారు. అయితే ఇక ఎయిమ్స్ వైద్యులు క్లిష్టమైన శస్త్ర చికిత్సను చేసారు. గత ఏడాది ఓ మహిళకు తోకతో ఉన్న బాలుడు జన్మించగా.. వయస్సు పెరిగే కొద్దీ ఆ తోక పెరుగుతూ వచ్చింది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే వైద్యులను సంప్రదించారు. అయితే ఆ తోక వెన్నుపూసతో అనుసంధానమై బయటికి వచ్చినట్లు వైద్యులు గుర్తించారు. ఇటీవలే బాలుడికి సర్జరీ చేసి తోకను తొలగించారు. నాడి వ్యవస్థకు ఆ తోక అటాచ్ అయి ఉండడంతో సమస్యలు ఎదురవుతాయని వైద్యులు భావించిన ప్రస్తుతం బాలుడి ఆరోగ్యం బాగానే ఉన్నట్లు చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: