మొన్నటి వరకు కరోనా వైరస్ అనే మహమ్మారితో ప్రపంచం మొత్తం ఎంత పెంబెలెత్తిపోయిందో  ప్రత్యేకంగా చెప్పాల్సినపనిలేదు. ఏకంగా ప్రశాంతంగా సాగిపోతున్న అందరి జీవితాలను అతలకుతలం చేసింది. ఎంతలా అంటే ప్రతి ఒక్కరూ మాస్క్ గుప్పెట్లో ప్రాణాలను కాపాడుకునే పరిస్థితికి కారణమైంది. ఇక ఎంతోమంది ప్రాణాలను గాల్లో కలిపేసింది కరోనా వైరస్. అయితే ఈ వైరస్ కారణంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోగా.. ఇక ప్రపంచ దేశాలు అన్ని మాస్క్ అనే ఆయుధంతో కనిపించని వైరస్ ను ఎదుర్కోవడంలో సక్సెస్ సాధించాయి అని చెప్పాలి.


 ఇక ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ వేసుకోవడం దానికి తోడు కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రతి ఒక్కరికి కూడా అవగాహన రావడంతో.. ఇక ఇప్పుడూ కరోనా వైరస్ కేసుల సంఖ్యనమోదు కావడం లేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇలాంటి సమయంలో  కరోనా నుంచిబయటపడ్డాము అనుకునే లోపే మరిన్ని ప్రమాదకరమైన వైరస్ లు  ఏకంగా మనుషుల ప్రాణాలను గాల్లో కలిపేసేందుకు పేరు మీదికి వస్తూనే ఉన్నాయి. దీంతో ప్రతిక్షణం ప్రాణాలను కాపాడుకునేందుకు మనిషి ఇక ఎన్నో జాగ్రత్తలు పాటించాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి.


 ఇక ఇప్పుడు గుజరాత్లో మరో ప్రమాదకరమైన వైరస్ వెలుగులోకి వచ్చింది. చాందీపురలో వైరస్ కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. ఇప్పటివరకు మొత్తం 14 కేసులు నమోదు అవ్వగా.. వారిలో ఏకంగా 8 మంది మృతి చెందినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రిషికేష్ పటేల్ తెలిపారు. అయితే రోగుల రక్త నమూనాలను పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపినట్లు చెప్పుకొచ్చారు. ఈ వ్యాధి దోమలు కీటకాల ద్వారా కూడా సోకుతుంది అంటూ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ వ్యాధి సోకిన వారికి జ్వరం మెదడువాపు ఫ్లూ లాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: