ఇటీవల కాలంలో కుక్కల దాడుల్లో బలైపోతున్న ప్రజల సంఖ్య పెరుగుతోంది. చిన్నపిల్లలనే ఇవి టార్గెట్ చేస్తున్నాయి. ఇటీవల ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ 18 నెలల బాలుడిని వీధి కుక్కలు ఈడ్చుకెళ్లి దారుణంగా గాయపరిచాయి. అయితే ఈ బాలుడు చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. ఈ విషాద సంఘటనతో తల్లిదండ్రులు కన్నీరు అవుతున్నారు. ఈ షాకింగ్ ఇన్సిడెంట్ హైదరాబాద్ సిటీ జవహర్‌నగర్‌ పరిధిలో జరిగింది. మృతుడి తల్లిదండ్రుల పేర్లు భరత్, లక్ష్మి.

సిద్దిపేట జిల్లా మిరుదొడ్డికి చెందిన వీరికి నిహాన్‌ (18 నెలలు) అనే కొడుకు ఉన్నాడు. అయితే కొద్ది రోజుల క్రితం ఉపాధి కోసం బాలాజీనగర్‌ వికలాంగుల కాలనీలో నివసిస్తున్న రిలేటివ్స్ ఇంటికి వెళ్లారు. వెంటే కుమారుడిని కూడా తీసుకొచ్చారు. అయితే జులై 16 రాత్రిపూట కుటుంబ సభ్యులందరూ ఒక చోట చేరి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. వారు మాటల్లో పడి ఉండగా నిహాన్‌ ఇంటి బయటకి వచ్చాడు అక్కడే ఆడుకుంటూ ఉండగా అతడిపై వీధి కుక్కలు అటాక్‌ చేశాయి. అనంతరం అతని జుట్టును నోట్లో పెట్టుకుని ఈడ్చికెళ్లాయి. ఈ క్రమంలో జుట్టు, చర్మం ఊడి నేలపై పడిపోయాయి.

 విహాన్‌ చారిపై వీధికుక్కలు సడన్‌గా పడిపోవడంతో వాటి నుంచి తప్పించుకోలేకపోయాడు. ఈ షాకింగ్ దృశ్యాన్ని చూసిన లోకల్స్ వెంటనే ఆ ప్రభుత్వం అయ్యే రాళ్లు విసిరారు. దాంతో కుక్కలు అక్కడినుంచి పారిపోయాయి. అప్పటికే బాలుడు తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోయాడు తల్లిదండ్రులు వెంటనే బాలుడిని గాంధీ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అయితే గాయాలు తీవ్రంగా కావడం వల్ల డాక్టర్లు కూడా పిల్లోడిని బతికించలేకపోయారు. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారుడు ఒంటినిండా కుక్క గాట్లతో విగత జీవిగా మారడం చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలాగా రోదించారు.

ఇకపోతే 4 రోజు క్రితం ఘట్ కేసర్‌లో కూడా వీధి కుక్కలు రెచ్చిపోయాయి. ఇద్దరు మహిళలపై స్ట్రీట్ డాగ్స్‌ ఎటాక్ చేయగా వారికి కూడా బాగానే గాయాలయ్యాయి. ఇదే నెలలో సంగారెడ్డి టౌన్, శాంతి నగర్‌లో ఓ ఆరేళ్ల బాలుడిపై వీధికుక్కల గుంపు దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. మున్సిపల్ అధికారులు వీధి కుక్కలు మనుషులపై దాడి చేయకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే కన్నవారికి కడుపుకోత మిగలక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: