సాధారణంగా కుక్కలు మనుషుల పట్ల ఎంత విశ్వాసం కలిగి ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక్క ముద్ద అన్నం పెట్టాము అంటే చాలు జీవితాంతం ఆ వ్యక్తిని గుర్తు పెట్టుకుంటాయి కుక్కలు. ఇక ఆ వ్యక్తి పట్ల ఎంతో విశ్వాసాన్ని కనపరుస్తూ ఉంటాయి. ఇక ఇలా కడుపు నింపిన వ్యక్తికి ఏదైనా ప్రమాదం వచ్చింది అంటే చాలు ఏకంగా ప్రాణాలకు తెగించి కాపాడటానికి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి.


 కానీ ఈ మధ్యకాలంలో మాత్రం మనుషులకి కుక్కలకి మధ్య వైరం పుట్టుకతోనే వచ్చిందేమో అన్న విధంగా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయ్. ఎందుకంటే మనుషులను చూస్తే చాలు ఏకంగా కుక్కలు దారుణంగా దాడి చేస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. మరీ ముఖ్యంగా అభం శుభం తెలియని చిన్నారులపై కుక్కల గుంపులు దాడి చేస్తూ దారుణంగా ప్రాణాలు తీస్తున్న ఘటనలు ప్రతి ఒక్కరిని కూడా ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయి. ఇటీవల హైదరాబాద్ నగరంలోని జవహర్ నగర్ లో ఏడాదిన్నర బాలుడు పై కుక్కల గుంపు దారుణంగా దాడి చేసి పీక్కుతిన ఘటన రాష్ట్రాన్ని ఎంతల ఉలిక్కిపడేలా చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.


 ఇక ఇప్పుడు ఈ దారుణమైన ఘటన గురించి మరవకముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. మరో బాలుడు పై ఇలాగే కుక్కలు దారుణంగా దాడి చేశాయి. జగిత్యాల జిల్లాలోని బీర్పూర్ మండలం మంగేలలో ఇంటి ముందు ఆడుకుంటున్న ఏడేళ్ల బాలుడిపై వీధి కుక్క దారుణంగా దాడి చేసింది. అయితే భయంతో బాలుడు కేకలు వేయడంతో పక్కనే ఇంట్లో ఉన్న మహిళ బయటికి వచ్చి ఆ కుక్కను బెదరగొట్టడంతో చివరికి బాలుడు అటు ప్రాణాలతో బయటపడగలిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో సీసీటీవీ కెమెరాలో రికార్డు కావడంతో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vir