ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి దీనివల్ల దోమలు బ్యాక్టీరియా పెరిగిపోతున్నాయి. వీటి కారణంగా రకరకాల జబ్బులు వస్తున్నాయి దీనివల్ల ప్రజలు డాక్టర్ల వద్దకు పరిగెత్తుతున్నారు. అయితే సిటీలకు చాలా సుదూర ప్రాంతాల్లో, అరణ్యాలకు దగ్గరగా ఉన్న ప్రదేశాల్లో నివసించే వారికి ఇది కుదరని పని. వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండవు. పట్నానికి వెళ్లాలంటే వాగులు వంకలు దాటుకొని పెద్ద సాహసమే చేయాల్సి ఉంటుంది.

 అయితే కొంతమంది డాక్టర్లు వీరి కోసం ఆలోచిస్తూ తమ ప్రాణాలను సైతం ప్రాణంగా పెట్టి ఆ ఊర్లకు వెళ్తున్నారు. అలాంటి వారిలో ఒకరిగా నిలుస్తున్నారు ములుగు జిల్లా వైద్యాధికారి (DMHO) అల్లెం అప్పయ్య. తాజాగా ఈ వైద్యాధికారి చేసిన సేవలు చూసే ఫిదా అయిపోయారు వైద్య శాఖామంత్రి మంత్రి దామోదర రాజనర్సింహ. అప్పయ్యను ప్రశంసిస్తూ ప్రతి ఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకుని ప్రజలకు సేవలందించాలని కోరారు.

అరణ్యంలో ఉన్న పెనుగోలు గ్రామానికి ఆయన స్వయంగా వెళ్లారు. ములుగు జిల్లాలోని వాజేడు మండలంలో ఈ గ్రామం ఉంది. సిటీకి 16 కి.మీ దూరంలో ఉండే ఈ గ్రామానికి చేరాలంటే 2 గుట్టలు, 3 వాగులు క్రాస్ చేయాలి. ఈ దట్టమైన అటవీ ప్రాంతంలో రోడ్డు సదుపాయం కూడా లేదు కాబట్టి 16 కి.మీ కాలినడకల వెళ్లాల్సిందే. అయినా వైద్యాధికారి డాక్టర్లను వెంటబెట్టుకుని వెళ్లారు. ఆగా ఆ గ్రామంలో రోగాలతో బాధపడుతున్న వారికి చికిత్స చేశారు.

ఈ గిరిజన గ్రామానికి వెళ్లిన వారిలో వాజేడు వైద్య అధికారి కొమరం మధుకర్, పెనుగోలు హెల్త్ అసిస్టెంట్ చిన్న వెంకటేష్, ఆశా వర్కర్ సమ్మక్క కూడా ఉన్నారు. వైద్య అధికారి గిరిజన గ్రామంలోని బస చేశారు. ప్రజల బాగోగుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ వర్షాకాలంలో సీజనల్ డిసీజెస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని కూడా సూచించారు. ప్రతి గిరిజన కుటుంబాన్ని సందర్శిస్తూ వారిలో జబ్బుల పట్ల అవగాహన పెంచారు.

 జ్వరాలు వచ్చినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని, పారాసెటమాల్ టాబ్లెట్లు చేసుకోవాలని చెప్పారు. అలాగే ఈ కాలంలో పాములు తేలు వంటివి ఇళ్లల్లోకి ప్రవేశిస్తాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. మొత్తం మీద అప్పయ్య ప్రజల కోసం చాలా కష్టాలను ఎదురొడ్డారు. అందుకే నెటిజన్లు ఆయనకు సెల్యూట్ చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: