నేటి రోజుల్లో పెళ్లి అనే బంధానికి విలువ లేకుండా పోయింది. పెళ్లి సమయంలో చేసిన ప్రమాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. దీంతో కలిసిమెలిసి బ్రతకాల్సిన భార్యాభర్తలు తమ చేష్టలతో మాటలతో ఏకంగా పచ్చటి కాపురంలో చిచ్చు పెట్టుకుంటున్నారు. దీంతో ఎక్కువ కాలం కలిసి ఉండలేక వైవాహిక బంధాన్ని తెంపుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఇక ఇలాంటి తరహా ఘటనలు నేటి రోజుల్లో కోకోలోలుగా వెలుగులోకి వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే


 అయితే కొంతమంది ఏకంగా మనస్పర్ధలు వచ్చిన కేవలం పిల్లల కోసం మాత్రమే కలిసి ఉండాలి అన్న ధోరనితో ఇక బంధాన్ని కొనసాగిస్తున్నారు అని చెప్పాలి. ఇక చివరికి ఇలా కలిసి ఉంటూ సమస్యలు మరింత పెద్దది చేసుకొని ఒకరిని ఒకరు చంపుకునేంత కక్ష పెంచుకుంటున్న ఘటనలు కూడా ప్రతి ఒక్కరిని ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయి. ఇక్కడ మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించి కర్ణాటకలో ఈ ఘటన జరిగింది. అతనికి అందమైన భార్య ఉందో ఇక ఊరిలో మంచి పలుకుబడి కూడా ఉంది. కానీ చివరికి వారి దాంపత్య జీవితం విషాదంగా ముగిసింది.


 తరచూ భర్త భార్య గొడవ పడుతూ ఉండేవారు. చివరికి మనస్పర్ధలు కారణంగా భార్యని దారుణంగా హత్య చేశాడు. కొడుక్కు జిల్లాలోని వీర్రాజుపేట శివారులో పెట్రోలి గ్రామంలో బోపన్న, శిల్పా సీతమ్మ భార్యాభర్తలు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శిల్ప సీతమ్మ ఊరిలో పెద్దమనిషి. గతంలో గ్రామపంచాయతీ సభ్యురాలుగా కూడా వర్క్ చేస్తుంది  ఆమెకు గ్రామంలో మంచి పలుకుబడి ఉంది. కానీ దాంపత్య జీవితమే బాలేదు. దీంతో ఒకే ఇంట్లో ఉంటున్న భార్యాభర్తలు ఇద్దరు వేరువేరు కుంపటి. పిల్లల కోసం కలిసి జీవిస్తున్నారు. అయితే తన ఖర్చులకు డబ్బులు ఇవ్వాలని భార్య శిల్ప కోరిక. భర్త మాత్రం ససేమిరా ఇలా అన్నాడు. మరోసారి భార్యాభర్తల మధ్య ఏదో విషయంపై గొడవ జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన భర్త భార్యను కాల్చి హత్య చేశారు. ఇక తర్వాత పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. భర్తను అదుపులోకి తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: