ఈ మధ్యకాలంలో చిన్నలు పెద్దలు అనే తేడా లేదు. ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా ప్రపంచంలో మునిగి తేలుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఎన్ని పనులున్నా సరే ప్రతిరోజు సోషల్ మీడియాలో కనీసం ఒక గంట సమయమైన గడపకపోతే ఎవరికి కాలక్షేపం కాదు. ఏదో మిస్ అయిన ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది. ఏకంగా పక్కన ఉన్న మనుషులతో మాట్లాడటమైన మానేస్తారేమో కానీ ఇక అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లో సోషల్ మీడియాలో ఓపెన్ చేసి చూడటం మాత్రం అస్సలు మానలేరు ఎవరు కూడా. అంతలా నేటి రోజుల్లో మనుషులను బానిసలుగా మార్చేసుకుంది సోషల్ మీడియా.


 నేటి రోజుల్లో ఈ సోషల్ మీడియా ఇక ఎంతో వినూత్నమైన ఎంటర్టైన్మెంట్ అందిస్తూ ఉండడంతో.. ఇక ప్రతి ఒక్కరు ఇక సోషల్ మీడియాకు బాగా అలవాటు పడిపోతున్నారు. అయితే కొంతమంది కేవలం ఇలా సోషల్ మీడియాలో ఎంటర్టైన్మెంట్ పొందుతూ ఉంటే.. ఇంకొంతమంది మాత్రం ఇక ఇదే సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇక ఇంస్టాగ్రామ్స్ లో రీల్స్ చేయడం అటు యూట్యూబ్లో షార్ట్స్ చేయడం లాంటివి చేస్తున్నారు. ఇక ఫాలోవర్ల కోసం ఏదో ఒకటి వినూత్నంగా ట్రై చేస్తూ ఉన్న వారిని చాలామందిని చూస్తూ ఉన్నామ్. అయితే కొంతమంది ఏకంగా ఇలాంటివి కొత్తగా ట్రై చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.


 ఇక్కడ ఇలాంటి తరహా ఘటనే జరిగింది. ఏకంగా రీల్స్ పిచ్చి 9 ఏళ్ల బాలుడికి ప్రాణం తీసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని మురైన జిల్లాలో వెలుగులోకి వచ్చింది. స్నేహితులతో కలిసి ఒక బాలుడు ఉరి వేసుకుంటున్నట్లు సరదాగా రీల్ షూట్ చేద్దామని అనుకున్నాడు. కానీ ఇలాంటి సరదా చివరికి ప్రాణాలను తీసేసింది. ముందుగా చెట్టుకు ఉరి వేసుకుంటున్నట్లుగానే తాడు కట్టి మెడకు చుట్టుకున్నాడు. కానీ ప్రమాదవశాత్తు చెప్పు స్లిప్ అయ్యి తాడు అతని మెడకు బిగుసుకుపోయింది. అయితే అతను నిజంగానే యాక్టింగ్ చేస్తున్నాడేమో అనుకుంటూ ఫ్రెండ్స్ ఫోన్లో వీడియో తీశారు తప్ప.. అతన్ని కాపాడలేదు. చివరికి ప్రాణాలు కోల్పోయాడు బాలుడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: