ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించడానికి జనాలు ఏం చేయడానికైనా రెడీ అవుతున్నారు అని చెప్పాలి. కొన్ని కొన్ని సార్లు ఏకంగా తమను తాము రిస్క్ లో పెట్టుకోవడమే కాదు ఇంకొన్నిసార్లు పక్క వాళ్ళని కూడా ప్రమాదంలోకి నెడుతూ ఉన్నారు. ఇక ఇలాంటి తరహా ఘటనలు ఈ మధ్యకాలంలో కోకోళ్లలుగా వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి. అంతేకాదు ఇలా సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లుగా ఉన్నవాళ్లు ఒకరికి ఒకరు ఎన్నో చాలెంజ్ లు విసురుకుంటూ ఉండటం కూడా చూస్తూ ఉన్నాం.


 ఇలా చాలెంజ్ చేసుకుంటున్న వాటిలో ఏకంగా ప్రమాదకరమైనవి కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక అమ్మాయి ఇలాంటి ఛాలెంజ్ స్వీకరించి చివరికి ప్రాణాలు మీదికి తెచ్చుకుంది. ఎక్కువగా తినాలి అనే చాలెంజ్ను స్వీకరించిన అమ్మాయి తింటూ తింటూ చివరికి ప్రాణాలను కోల్పోయింది. దీంతో ఇది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన విషయం తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ లో మునిగి పోతున్నారు అని చెప్పాలి. అయితే ప్రస్తుతం ఈటింగ్ ఛాలెంజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంది. ఎవరు ఎక్కువ ఫుడ్ తీసుకుంటారు అనే విషయంపై ఈ ఛాలెంజ్ కొనసాగుతుంది.


 అయితే ఈ ఈటింగ్ ఛాలెంజ్ అటు ఒక ఇన్ఫ్లుయెన్సర్ ప్రాణాలు తీసింది. చైనాకు చెందిన పాన్ జియోటిక్ అనే 24 ఏళ్ల అమ్మాయి లైవ్ టెలికాస్ట్ లో ఎక్కువ ఆహారం తీసుకోవాలి అని ఈటింగ్ ఛాలెంజ్ని తీసుకుంది. ఈ క్రమంలోనే ఆహారం తింటూ తింటూ చివరికి ప్రాణాలు కోల్పోయింది. అయితే ఈమె ఇలాంటి వీడియోలు చేయడంలో చాలా ప్రసిద్ధి. ప్రతిసారి పది కిలోల కంటే ఎక్కువ మొత్తంలోనే ఆహారాన్ని తింటూ ఉండేదట. అయితే ఇటీవల నిర్వహించిన ఛాలెంజ్లో ఏకంగా 10 గంటల పాటు నాన్ స్టాప్ గా తింటూ తింటూ చివరికి కుప్పకూలిపోయింది. జీర్ణించుకోలేని స్థాయిలో ఆమె ఆహారం తినడంతో.. చివరికి ఇలా ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: