ఈ భూమి మీద ఎన్నో రకాల జీవులు ఉన్నప్పటికీ మనిషి అనే జీవి మాత్రం ఎంతో ప్రత్యేకమని చెబుతూ ఉంటారు. ఎందుకంటే మిగతా జీవులతో పోల్చి చూస్తే మనిషిలో విచక్షణ జ్ఞానం అనేది ఒకటి ఉంటుంది. అందుకే మనిషి అనే జీవి ఎంతో ప్రత్యేకమైనదే. ఇక పరిస్థితులకు అనుగుణంగా అటు మనిషి ప్రవర్తన తీరు ఉంటుంది అని చెప్పాలి. ఇక జంతువులతో పోల్చి చూస్తే అటు మనిషిలో జాలి దయాగుణం అనేది ఉంటుంది. సాటి మనిషి పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరిస్తూ ఉంటాడు. అయితే నేటి రోజుల్లో ఇవన్నీ ఒట్టి మాటలుమాత్రమే. ఎందుకంటే నేటి రోజుల్లో మనిషి అడవుల్లో ఉండే మృగం కంటే అత్యంత ప్రమాదకరంగా మారిపోతున్నాడు.


 సాటి మనుషుల పట్ల కాస్తయినా జాలీ దయ లేకుండా ఎంతో కర్కశంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఈ క్రమంలోనే చిన్న చిన్న కారణాలకే ఏకంగా సాటి మనుషుల ప్రాణాలు తీయడానికి కూడా వెనకడుగు వేయని పరిస్థితి.. నేటి సభ్య సమాజంలో నెలకొంది. అదే సమయంలో సాటి మనుషులను అసలు మనుషులుగానే చూడని ఆలోచన ధోరణితో మనిషి ముందుకు సాగుతున్న తీరు ప్రతి ఒక్కరిని కూడా భయాందోళనకు గురిచేస్తుంది అని చెప్పాలి. ఇప్పుడు మనిషి ఎంత మృగంలా మారిపోయాడు అన్నదానికి నిదర్శనంగా ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఘటన మారింది.


 సాధారణంగా ఏ ప్రాంతానికి వెళ్లిన కొంతమంది మధ్య భూ వివాదాలు నెలకొంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇక్కడ ఇలాంటి భూవివాదం నెలకొనగా.. ఇద్దరు మహిళలను కొంతమంది వ్యక్తులు బతికుండగానే పూడ్చేందుకు  ప్రయత్నించారు. ఈ అమానవీయ ఘటన మధ్యప్రదేశ్ లోని రీవార్ జిల్లా హీనౌతాలో వెలుగులోకి వచ్చింది. తమ భూమిలో రోడ్డు వేయొద్దని ఇద్దరు మహిళలు నేలపై కూర్చొని నిరసన చేపట్టారు. ఇవేమీ పట్టించుకోని ట్రక్కు డ్రైవర్ ఏకంగా ఆ ట్రక్కులోని మట్టిని మొత్తం వారిపై పోసేశాడు. ఈ క్రమంలోనే ఆ ఇద్దరు మహిళలకు కూడా నడుము లోతు వరకు కూడా పూర్తిగా మట్టిలో కూడుకుపోయారు. అయితే వెంటనే స్పందించిన స్థానికులు వారిని కాపాడారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: