ఈ భూమ్మీద ఏకంగా మనిషి ప్రాణాలను నిమిషాల వ్యవధిలో తీయగల జీవులు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో పాములు కూడా ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే కొన్ని పాములు చూడ్డానికి ఎంతో చిన్న ఆకారంలో కనిపించినప్పటికీ ఒక్క కాటుతో ఏకంగా విషాన్ని మనిషి శరీరంలోకి పంపించి ఇక నిమిషాల వ్యవధిలో ప్రాణాలను గాల్లో కలిసిపోయేలా చేస్తూ ఉంటాయి. మరికొన్ని పాములు ఇక విషంతో చంపకపోయినప్పటికీ ఇక వాటికి ఉన్న బలంతో ఏకంగా ప్రాణాలను తీసేస్తూ ఉంటాయి అని చెప్పాలి. అలాంటి వాటిలో కొండచిలువ కూడా ఒకటి.


 నాగుపాము లాగా కొండచిలువకు ప్రమాదకరమైన విషపు కోరలు లేకపోయినప్పటికీ.. ఇక కొండచిలువకు దాని బలమే ప్రధాన అస్త్రం. ఇక అది దాడి చేయాలనుకున్న జంతువు అయినా మనిషినైనా సరే ఎంతో గట్టిగా చుట్టేసి ముందు ఊపిరాడకుండా చేసి ప్రాణాలను తీసేస్తుంది. ఇక ఆ తర్వాత మనుషులను ఆహారంగా మార్చుకుంటూ ఉంటుంది అని చెప్పాలి. ఇక ఇలా కొండచిలువ ఎంత దారుణంగా దాడి చేసే ప్రాణాలను తీసేస్తుంది అన్నదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటాయి. ఇక ఇవి చూసి నెటిజెన్స్ అందరు కూడా షాక్ అవుతారు.


 ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియోనే ఒకటి వెలుగులోకి వచ్చింది. కేరళలో ఒక కూలికి భయానక అనుభవం ఎదురయింది. ఒకరకంగా చెప్పాలంటే ప్రాణాలు పోయినంత పని అయింది అని చెప్పాలి. ఎందుకంటే అతను నిద్రిస్తున్న సమయంలో ఒక భారీ కొండచిలువ అతని దగ్గరికి వచ్చింది. అయితే అతను గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఏకంగా అతని మెడను చుట్టేసిన కొండచిలువ ఓపిరాడకుండా చేసింది. ఇక వెంటనే అతను అప్రమత్తమై కేకలు వేయడంతో అక్కడికి పరుగులు పెట్టుకుంటూ వచ్చిన స్థానికులు కాపాడే ప్రయత్నం చేశారు. కాగా మెడకు బలంగా చుట్టుకున్న కొండచిలువను తీసేందుకు తీవ్రంగా శ్రమించారు. చివరికి దానీని పట్టు నుంచి విడిపించడంతో ఆ కూలి ఊపిరి పీల్చుకుని బతికి బయటపడ్డాడు. ఈ వీడియో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: