ప్రస్తుతం సోషల్ మీడియా అనేది ప్రపంచ నలమూలకు పాకిపోయింది. దీంతో ఇక ఏదైనా తెలుసుకోవాలంటే ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లో ఒక క్లిక్ ఇస్తే చాలు.. ప్రపంచ నలుమూలలో జరిగిన ప్రతి విషయం కూడా ఇట్టే కళ్ళముందు వాలిపోతూ ఉంటుంది. దీంతో ఇక అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ తోనే ప్రపంచాన్ని మొత్తం చుట్టేయగలుగుతున్నాడు మనిషి. ఈ క్రమంలోనే ప్రతి రోజు కూడా సోషల్ మీడియాలో ఎన్నో రకాల ఘటనలు వెలుగులోకి వస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే.


 ఇలా వెలుగులోకి వచ్చే కొన్ని ఘటనలు అందరిని నవ్విస్తే.. ఇంకొన్ని ఘటనలు ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి. ఇక మరికొన్ని ఘటనలు భయభ్రాంతులకు లోన్ అయ్యేలా చేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇలాంటి తరహా ఘటనల గురించి తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే. సాధారణంగా ప్రతి ఇంట్లో ఈగలు దోమలు లాంటివి ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే  ఈగలు దోమలు లాంటివి మన మీద వాలినప్పుడు వాటిని కొడుతూ ఉంటాం. ఇది సర్వసాధారణంగా అందరూ చేసే పని. కానీ ఇలా తన ముఖంపై వాలిన ఈగను కొట్టాలనుకున్న ఆలోచన.. ఆ వ్యక్తికి శాపంగా మారిపోయింది.



 ముఖంపై వాలిన ఈగను కొట్టడం కారణంగా ఒక వ్యక్తి కన్నును కోల్పోయాడు. ఏకంగా తన ఎడమ కన్ను కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు  చైనాలోని ఎన్ జెన్ లో ఉండే ఒక వ్యక్తి తన ముఖం మీద వాలిన ఈగను కొట్టాడు. అయితే గంటలోనే ఎడమ కన్ను ఎర్రగా మారింది. వాపు కూడా వచ్చింది. నొప్పి కూడా మొదలు కావడంతో వెంటనే ఆసుపత్రికి వెళ్ళాడు  అయితే కండ్ల కలక కావచ్చు అని అందరూ ముందుగా అనుకున్నారు. అయితే చికిత్స చేసిన అది తగ్గలేదు. చివరికి ఇన్ఫెక్షన్ పెరిగి ఆరోగ్యం క్షమించింది. దీంతో ఇక ఆ ఇన్ఫెక్షన్ ఎక్కడ మెదడుకు చేరుతుందో అన్న కారణంతో వైద్యులు అతని కనుగుడ్డు తొలగించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: