ఈ మధ్యకాలంలో మొబైల్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. కేవలం మనిషి అవసరాలు మాత్రమే తీర్చడానికి వచ్చిన మొబైల్ చివరికి ఆ మనిషినే బానిసగా మార్చేసుకుంటుంది. మొబైల్ లోనే మనిషికి కావాల్సినవన్నీ  దొరుకుతూ ఉండడంతో ఇక బయట ప్రపంచంతో అసలు పనే లేకుండా పోయింది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ మధ్యకాలంలో అటు చదువుకునే పిల్లలు కూడా మొబైల్ కి బానిసలుగా మారిపోతూ ఉండడం చూస్తూ ఉన్నాం.


 అయితే ఇలా ఎన్నో రకాల సదుపాయాలను అందిస్తున్న మొబైల్ చివరికి ఎంతో మంది ప్రాణాలు పోవడానికి కూడా కారణం అవుతుంది. చాలామంది ఏకంగా మొబైల్ కి ఛార్జింగ్ పెట్టి అలాగే ఫోన్ మాట్లాడుతూ.. కరెంట్ షాక్ కి గురై ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలా ప్రతి ఏటా ఎంతో మంది చిన్నారులు కూడా విద్యుదగాధంతో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఏకంగా మొబైల్ చార్జర్ ఒక చిన్నారి ఉసురు తీసింది. ఖమ్మం జిల్లాలో ఈ విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. మత్కేపల్లిలో జరిగింది ఈ ఘటన.



 సెల్ ఫోన్ కి ఛార్జింగ్ పెడుతుండగా కరెంట్ షాక్ కొట్టి ఎనిమిదేళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. తడి చేతులతో చార్జింగ్ పెడుతున్న సమయం లో షాక్ కొట్టడం తో ఒక్క సారిగా అపస్మారక స్థితి లోకి వెళ్లి కుప్పకూలి పోయింది బాలిక. అయితే తల్లిదండ్రులు వెంటనే కంగారుపడి దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకువెళగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో అప్పటి వరకు ఎంతో సరదాగా గడిపిన కూతురు ఇక లేదు అన్న విషయాన్ని జీర్ణించుకోలేక తల్లిదండ్రులు కన్నీరు మునీరుగా విలపించారు. కాగా మొబైల్ కి ఛార్జింగ్ పెట్టేటప్పుడు చేతులను పొడిగా ఉంచుకోవాలని డాక్టర్లు సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: