అవును, మీరు ఇక్కడ చదివింది నిజమే. గుర్రం వలన ఓ నిండు ప్రాణం బలి అయిపోయింది. దాంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. అక్కడ గుర్రపు స్వారీ చేయడం అనేది అనాదిగా వస్తున్న సంప్రదాయం. మరీ ముఖ్యంగా దసరా సమయాలలో గుర్రంపై ఊరేగడం ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ అని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే ఓ యువకుడు గుర్రం స్వారీని నేర్చుకోవడం మొదలు పెట్టాడు. కానీ అదే అతడి ప్రాణాలను బలి తీసుకుంటుంది అని కలలో కూడా అతగాడు ఉహించి ఉండడు. గుర్రపు స్వారీ చేస్తే చనిపోవడం ఏంటి అని ఆలోచిస్తున్నారా? విషయం తెలియాలంటే ఇది పూర్తిగా చదవాల్సిందే.
కర్నూలు జిల్లాలో జరిగిన ఈ ఘటన అతడి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కాగా దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విషయంలోకి వెళితే... మద్దికేరకు చెందిన పృథ్వీరాజ్ రాయుడు అనే యువకుడు గుర్రపు స్వారీ నేర్చుకోవాలని ఆశపడి గుర్రంపై ఎక్కి ప్రాక్టీస్ చేస్తూ రోడ్డు మీదకి వచ్చాడు. వెనుక అతని ఫ్రెండ్స్ బైక్‌పై గుర్రాన్ని ఫాలో అవుతూ ఆ గుర్రం మరింత స్పీడుగా పరుగెత్తాలని పెద్దగా అరుస్తూ కేకలు వేశారు. దాంతో ఆ గుర్రం మరింత వేగంగా పరిగెత్తేలా చేశారు. ఈ క్రమంలో గుర్రం వేగానికి పృథ్వీరాజ్ కూడా గుర్రపు స్వారీని ఎంజాయ్ చేశాడు.
కట్ చేస్తే... ఇంతలో గుర్రం వేగం పరిమితికి దాటి మించిపోయింది. దాంతో ఆ యువకుడు పట్టుతప్పి గుర్రంపై నుంచి అమాంతం కింద పడ్డాడు. దాంతో రోడ్డు దెబ్బ గట్టిగానే తిన్నాడు. ఆ వెంటనే స్థానికులు అతడ్ని కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినా లాభం లేకుండా పోయింది. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు పాపం. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. కాగా పృథ్వీరాజ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మద్దికెరలో దసరా ఉత్సవాల్లో ఈ వంశీకులు గుర్రంపై స్వారీ చేయడం సంప్రదాయం అంటున్నారు స్థానికులు. ఈ క్రమంలోనే పృథ్వీరాజ్ గుర్రం స్వారీ నేర్చుకోవాలని ఆశపడి ప్రాణలు కోల్పోయినట్లు చెబుతున్నారు.