ఇక పాములు జోలికి వెళ్లకుండా ఉండేందుకు ఎన్నో జాగ్రత్తలు కూడా తీసుకుంటారు. అయితే ఇలా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొన్ని కొన్ని సార్లు ప్రమాదవశాత్తు పాముకాటుకు గురై ఇక ప్రాణాలు కోల్పోతూ ఉంటారు అనే విషయం తెలిసిందే. మరి ముఖ్యంగా వర్షాకాలంలో ఎక్కడబడితే అక్కడ ఇక పాములు దర్శనమిస్తూ ఉండడం చూస్తూ ఉంటాం. ఈ క్రమంలోనే పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఇక ప్రమాదాలలో నివారించుకోవాలి అంటూ అధికారులు సూచిస్తూ ఉంటారు. కేవలం మనదేశంలోనే కాదు అన్ని దేశాలలో కూడా ఇలా పాముకాటుకు ఎంతో మందికి గురవుతూ ఉంటారూ అన్న విషయం తెలిసిందే.
కాగా పాముకాటు కారణంగా భారత్ లో ఏక 50 వేల మంది మరణిస్తున్నారు అన్న విషయాన్ని ఇతివలె బిజెపి ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ లోక్సభలో గుర్తు చేశారు. దీంతో ఈ విషయం కాస్త హాట్ టాపిక్గా మారిపోయింది. ఇలా పాముకాటు ద్వారా ఎక్కువ మరణాలు సంభవిస్తున్న దేశాలలో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది అని తెలిపారు. ప్రతి ఏటా ఏకంగా 40 లక్షల మంది వరకు కూడా పాము కాటుకు గురవుతున్నారని.. 50 వేల మంది చనిపోతున్నారని చెప్పుకొచ్చారు ఆయన. సత్వర చికిత్స అందించిన వారు బ్రతికిబయట పడగలుగుతుంటే.. ఇక అవగాహన లేని వారు మాత్రం ప్రాణాలు కోల్పోతున్నారు అంటూ ఆయన చెప్పుకొచ్చారు. అందుకే ఇక పాము కాటుకు గురైతే సత్వర చికిత్స అందించేలా సిస్టం తీసుకురావాలని లోక్సభలో కోరారు బిజెపి ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడి.