సాధారణంగా ఎంతో మంది జనాలు తమ వీర్యకణాలను డొనేట్ చేస్తూ ఉంటుంటారని.. ఎంతోమంది పిల్లలు లేని వారికి సహాయం చేస్తూ ఉంటారు అని సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కొన్ని వార్తలు వైరల్ గా మారిపోతూ ఉంటాయి. అయితే ఇలా స్పర్మ్ డొనేట్ చేయడంపై గతంలో హాలీవుడ్లో స్పర్మ్ డోనర్ అనే ఒక సినిమా కూడా వచ్చింది. అయితే ఇక తర్వాత కాలంలో టాలీవుడ్ లో కూడా నరుడా డోనరుడా అని మూవీ కూడా వచ్చింది అన్న విషయం తెలిసిందే.


అయితే ఇలాంటి సినిమాలను చూసిన తర్వాత కేవలం స్పర్మ్ డొనేట్ చేసేవారు  సినిమాల్లో మాత్రమే కనిపిస్తారని రియల్ లైఫ్ లో మాత్రం ఇలాంటి మనుషులు అస్సలు ఉండరు. అయినా ఇలా స్పార్మం డొనేట్ చేయడానికి ఎవరూ ఒప్పుకుంటారు చెప్పండి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ రియల్ లైఫ్ లో కూడా చాలామంది ఇలా స్పెర్మ్ డొనేట్ చేయడం చేస్తూ ఉన్నారు అన్న విషయం అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతోంది. అయితే టెలిగ్రామ్ సీఈవో సైతం తాను స్పర్మ్ డోనర్ అంటూ ఇటీవల షాకింగ్ విషయం చెప్పుకొచ్చాడు. ఇది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియా జనాలు అందరిని కూడా షాక్ కి గురిచేస్తుంది అని చెప్పాలి.



 తనకు ఇంకా పెళ్లి కాలేదని.. కానీ వంద మంది పిల్లలు ఉన్నారు అంటూ టెలిగ్రామ్స్ ఏవో పావెల్ దొరవ్ తెలిపారు. 15 ఏళ్ల క్రితం నా ఫ్రెండ్ నన్ను వింత సహాయం చేయమని కోరాడు. తన మిత్రుడు అతని భార్యకు పిల్లలు పుట్టే అవకాశం లేకపోవడంతో వీర్య దానం చేయమని ఆయన కోరాడు. అయితే తొలుత అతను చెప్పిన మాటతో నవ్వుకున్నప్పటికీ ఆ తర్వాత సమస్య తీవ్రత అర్ధమైంది. ఇదొక సామాజిక బాధ్యత అని గుర్తించాను అందుకే  12 దేశాలలో ఏకంగా 100 మందికి పైగా స్పర్మ్ డొనేట్ చేశాను అంటూ చెప్పుకొచ్చాడు పావెల్. ఈ విషయం తెలిసి నేటిజన్స్ అందరూ కూడా అవాక్కవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: