మనిషి సంపాదించిన సంపాదించకపోయిన.. ఆకలితో ఉన్న కడుపు నింపుకున్న.. సంపన్నుడిగా ఉన్న కటిక పేదరికంలో ఉన్న సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఎంతో ముఖ్యం అన్న విషయం తెలిసిందే. ఆత్మ అభిమానం ఉన్న వ్యక్తులు ఎవరి దగ్గర చేయి చాచరు అని ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో మాత్రం ఎంతోమంది తమ ఆత్మ అభిమానాన్ని చంపుకొని ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం.


ఇలా సెల్ఫ్ రెస్పెక్ట్ ను చంపుకుని తమకు ఇష్టం లేని పని చేస్తూ చివరికి ఎంతోమంది కుటుంబం కోసం కష్టపడుతున్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఇలా తాము కష్టపడలేము అని క్లారిటీ ఉన్నవాళ్లు.. భిక్షాటన చేసి అడుక్కోవడం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే రైల్వే స్టేషన్ లో బస్ స్టాండ్లు ఇలా ప్రతి చోట కాళ్లు చేతులు బాగా ఉండి పని చేసుకునే సత్తువ  ఉండి కూడా ఎంతోమంది భిక్షాటన చేస్తూ చేతులు చాచి అడుక్కుంటూ ఉండటం కనిపిస్తూ ఉంది. ఏదో ఉద్యోగానికి వెళ్లి పని చేయడం కంటే వ్యాపారం చేసి బోల్తా కొట్టడం కంటే ఇక ఇలా భిక్షాటన చేయడమే మేలు అని కొంతమంది అనుకుంటున్నారు.


 ఇలాంటి నేటి సమాజంలో ఇక్కడ ఒక వృద్ధుడు మాత్రం సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఎలా ఉంటుందో అన్న విషయాన్ని చూపించాడు  ఓ వృద్ధుడు చార్జికి డబ్బులు లేక ఆత్మాభిమానంతో ఎవరిని చేయి చాచి అడుక్కోలేక.. 600 కిలోమీటర్ల పాటు నడుచుకుంటూ వచ్చాడు. ఒడిశాలోని దుమర బెడకు చెందిన సోనో భద్ర అనే 65 ఏళ్ల కూలి పని కోసం హైదరాబాద్ వెళ్ళాడు. కానీ అక్కడ ఆయనను చూసి వయస్సు ఎక్కువగా ఉందని ఎవరూ పనిలో చేర్చుకోలేదు. దీంతో చార్జీలకు సరిపడా డబ్బులు లేక 14 రోజులపాటు నడుచుకుంటూ తన గ్రామానికి చేరుకున్నాడు  మధ్యలో ఎవరైనా భోజనం పెడితే తింటూ ఇక అలసిన చోట నిద్రపోతూ ఇలా నడక సాగించాడు సదరు వ్యక్తి. అతని గురించి తెలిసి అందరూ షాక్ అవుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: