దీంతో ఇలాంటి ఘటనలు చూసిన తర్వాత ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియని పరిస్థితి ఈ నేటి సభ్య సమాజంలో నెలకొంది అని చెప్పాలి. అయితే కొంతమంది కామాంధులు ప్రేమ పేరుతో ఎంతోమంది అమ్మాయిలకు దగ్గరై చివరికి అవసరాలు తీర్చుకుని నడిరోడ్డుపై వదిలేసి మొహం చాటేస్తున్న ఘటనలు కూడా నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్నాయ్. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే అని చెప్పాలి. యువతిని మోసం చేసి అవసరాలు తీర్చుకొని వదిలేసిన ఒక యువకుడు.. చివరికి పారిపోయేందుకు ప్రయత్నించగా.. చివరికి అతన్ని పోలీసులు అరెస్టు చేశారు.
చత్తీస్గడ్ కు చెందిన అమ్మాయితో స్వామికి ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. అయితే ఆమెను హైదరాబాద్కు రప్పించిన సదరు యువకుడు.. పెళ్లి చేసుకుంటాను అని నమ్మించాడు. ఈ క్రమంలోనే ఆమెను తీసుకొని అత్యాచారం చేశాడు. చివరికి పెళ్లి మాట ఎత్తగానే ముఖం చాటేసి ఆస్ట్రేలియా పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే బాధితురాలు ఫిర్యాదుతో మహంకాళి పోలీసులు ఎయిర్పోర్టులో స్వామిని అరెస్టు చేశారు. అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చింది.