ఈ ప్రపంచంలో ఎన్నో రకాల జీవులు ఉన్నాయి. ఇలా భూమ్మీద ఉన్న కోట్లాది జీవరాశుల్లో విశ్వాసానికి మారుపేరైన జీవి ఏది అంటే మాత్రం ముందుగా వినిపించే పేరు శునకం. ఏకంగా కుక్క విశ్వాసానికి మారుపేరుగా ఉంటుంది అని అంటూ ఉంటారు. అనడం ఏంటి ఇది నిజమే అన్న విషయం ఎన్నో ఘటనలు కూడా ఇప్పటివరకు నిరూపించాయి అన్న విషయం తెలిసిందే. ఏకంగా కుక్కలకు ప్రేమతో ఒక్క ముద్ద అన్నం పెడితే చాలు అవి చచ్చిపోయేంతవరకు కూడా విశ్వాసంతోనే ఉంటాయి అని చెప్పాలి. అందుకే మనుషులకి కుక్కలకి మధ్య ఇక ఈ మధ్యకాలంలో బంధం మరింత బలపడుతుంది.


 ఎంతోమంది ఏకంగా తమ ఇష్టమైన కుక్కలను పెంచుకోవడం చేస్తూ ఉన్నారు. అంతేకాదు ఏకంగా మనుషులపై ప్రేమ చూపించినట్లుగానే కుక్కలపై కూడా ప్రేమ చూపిస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే అటు కుక్కలు కూడా తమ యజమానుల పట్ల అదే రీతిలో విశ్వాసాన్ని ప్రేమను కనబరుస్తున్నాయి. ఏకంగా యజమానికి ఏదైనా ప్రమాదం వాటిల్లింది అని తెలిస్తే చాలు.. ప్రాణాలకు తెగించి అయినా సరే కాపాడటానికి సిద్ధమవుతున్న వీడియోలు కూడా నేటి రోజుల్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి. అయితే కుక్కలు ఎంత విశ్వాసంగా ఉంటాయి అన్నదానికి నిదర్శనంగా ఇక్కడ ఇప్పుడు మరో ఘటన కూడా వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి.



 కర్ణాటకలోని బెలగావిలో అద్భుతమే జరిగితే. మహారాష్ట్రలోని పండర్పూర్ కు పాదయాత్రగా వెళ్లిన తన యజమానిని అనుసరిస్తూ పెంపుడు కుక్క కూడా వెళ్ళింది. అయితే యాత్రలో కుక్క తప్పిపోయింది. ఎంత వెతికినా దొరకకపోవడంతో చివరికి వెతకడం మానేసి.. అతను ఇంటికి వెళ్లిపోయాడు. ఎంతో ప్రేమగా పెంచుకున్న కుక్క తప్పిపోయింది అని ఎంతో బాధపడ్డాడు. అయితే ఆ తర్వాత 15 రోజులకి ఇలా తప్పిపోయిన కుక్క ఇంటి ముందుకు వచ్చి నిలబడింది. కాగా దేవుడి కృపతోనే ఇలా ఎక్కడో తప్పిపోయిన కుక్క 254  కిలోమీటర్ల పాటు నడిచి వచ్చి ఇక మళ్ళీ ఇంటికి చేరుకుంది అని సంతోష పడిన కుటుంబ సభ్యులు.. ఏకంగా సంబరాలు చేసి ఊరంతా భోజనాలు కూడా పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: