ఇలాంటి ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో.. ఆడపిల్ల ఇల్లు దాటి కాలు బయట పెట్టాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల ఏకంగా ఇంట్లో వాళ్ళ నుంచి కూడా లైంగిక వేధింపులు ఎదురవుతున్న నేపద్యంలో.. ఆడపిల్లలు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఇలా అత్యాచార ఘటనల్లో కోర్టులు కాస్త కఠినంగానే వ్యవహరిస్తున్నాయి. ఇక అఘాయిత్యాలకు పాల్పడిన నిధితులకు కఠినమైన శిక్షలు విధిస్తూ ఉండడం గమనార్హం. కాగా ఇటీవల తెలంగాణ హైకోర్టు కూడా ఇలా అత్యాచారం కేసులో దోషిగా తేలిన నిందితుడికి ఏకంగా ఉరిశిక్షను విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
2018లో నార్సింగిలో నాలుగున్నరెళ్ల ఏళ్ల బాలికను దినేష్ అంటే సెంట్రింగ్ కార్మికుడు అత్యాచారం చేసి దారుణంగా చంపేశాడు. అయితే 2021 లో అతడికి రంగారెడ్డి కోర్టు ఉరిశిక్ష విధించింది. దినేష్ హైకోర్టును ఆశ్రయించగా.. ఈ విషయంపై ఇక హైకోర్టులో విచారణ జరుగుతూ వచ్చింది. తాజాగా హైకోర్టు కూడా తీర్పును వెలువరించింది. అయితే రంగారెడ్డి జిల్లా కోర్టు విధించిన ఉరిశిక్ష తీర్పునే అటు తెలంగాణ హైకోర్టు కూడా సమర్థిస్తూ తీర్పుని ఇవ్వడం గమనార్హం. ఆడపిల్లలపై అత్యాచారానికి పాల్పడిన నీచులకు ఇలాంటి ఉరిశిక్షల విధించాలి అంటూ ఎంతో మంది హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఉన్నారు అని చెప్పాలి.