ఈ మధ్యకాలంలో మనుషులందరూ కూడా సోషల్ మీడియా అనే మాయలో మునిగి తేలుతూ ఉన్నారు. అయితే సోషల్ మీడియాలో కావాల్సినవన్నీ కూడా దొరుకుతూ ఉండడంతో బయట ప్రపంచంతో ఎవరికి పని లేకుండా పోయింది అన్న విషయం తెలిసిందే. కొంతమంది సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చే వీడియోలను చూసి ఎంటర్టైన్మెంట్ పొందుతూ ఉంటే.. ఇంకొంతమంది ఇక సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించుకోవాలని అనుకుంటున్నారు. దీనికోసం చేయకూడని  పనులన్నీ కూడా చేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే.


 కొంతమంది ఏకంగా ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం చివరికి ప్రాణాలను రిస్కులో పెట్టుకుంటూ ఉంటే.. ఇంకొంతమంది మాత్రం ఇలాంటి పాపులారిటీ కోసమే ఇతరుల ప్రాణాలను సైతం ప్రమాదంలో పడేసే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి ఒక ఘటన గురించే. ఈ మధ్యకాలంలో రైలు ప్రమాద ఘటనలు ఎంతలా పెరిగిపోయాయి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలాంటి ఘటనలు ఎన్నో ఇళ్లల్లో విషాదాన్ని నింపుతూ ఉన్నాయి. అయితే ఇలాంటి సమయంలో ఇక్కడ ఒక యువకుడు ఏకంగా సోషల్ మీడియాలో పాపులారిటీ రావడం కోసం ప్రవర్తించిన తీరు అందరికీ కోపం తెప్పిస్తుంది అని చెప్పాలి.


 ఒక రకంగా తన సంతోషం కోసం వేలాదిమంది ప్రాణాలను రిస్కులో పెట్టేందుకు కూడా సిద్ధమయ్యాడు. దీంతో సదురు యువకుడు చేసిన వికృత చేష్టలు అందరికీ కోపం తెప్పిస్తున్నాయ్. ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఒక యూట్యూబర్ రైల్వే ట్రాక్పై రాళ్లు గ్యాస్ సిలిండర్ సైకిల్ లాంటివి ఉంచాడు. అయితే రైలు వాటిపై నుంచి వెళ్తే ఏం జరుగుతుందో ఇక తన ఫాలోవర్స్ అందరికి కూడా చూపించాలి అని అనుకున్నాడు. ఇలా చేయడం ద్వారా పాపులారిటీ రావడంతో పాటు డబ్బులు కూడా సంపాదిస్తున్నాడు ఇలాంటి దుశ్చర్యాలతోనే రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక ఈ వీడియో చూసి ఎంతో మందిని నటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ ఘటనపై రైల్వే అధికారులకు ఎంతోమంది స్థానికులు ఫిర్యాదు చేశారు అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: