ఆడపిల్లల తల్లిదండ్రులకు నిద్రలేకుండా చేస్తుంది. ఇలాంటి తరహా ఘటనలు ఇక ఇటీవల కాలంలో తరచూ వెలుగులోకి వస్తూ ఉన్నాయి. అయితే బయట ఆకతాయిల నుంచి మాత్రమే కాదు ఇంట్లో వాళ్ళ నుంచి కూడా ఆడపిల్లలు లైంగిక వేధింపులు ఎదుర్కొంటూ ఉండడంతో.. ఇక తమ సమస్యను ఎవరికి చెప్పుకోవాలో తెలియక దుర్బర జీవితాన్ని గడుపుతున్నారు అని చెప్పాలి. అయితే ఇక్కడ ఒక కామాంధుడు సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తించాడు. కనీ పెంచిన తల్లి విషయంలోనే కామపు కోరికలతో రగిలిపోయాడు. చివరికి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు మనిషి రూపంలో ఉన్న ఆ రాక్షసుడు.
ఈ ఘటనతో ప్రస్తుతం అందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడుతున్నారు. సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటన మెదక్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. మాసాయిపేట మండలంలో తల్లి పైనే కుమారుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. భార్యా పిల్లలు మహంకాళి జాతరకు వెళ్లడంతో తల్లితో ఇంటి వద్ద ఉన్న ఒక యువకుడు.. మద్యం మత్తులో ఈనెల 29వ తేదీన రాత్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఆలస్యంగా నిన్న వృద్ధురాలైన తల్లి పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అయితే తల్లి చెల్లి అనే తేడా లేని ఈ మానవ మృగాన్ని దారుణంగా ఉరిశిక్ష వేసి శిక్షించాలి అంటూ అందరూ డిమాండ్ చేస్తున్నారు.