ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి ఒక్కరు కూడా రోడ్డునిబంధనలు పాటించి ప్రమాదాలను నివారించాలి అంటూ ఎప్పటికప్పుడు ట్రాఫిక్ పోలీసులు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇక్కడ ట్రాఫిక్ నిబంధనలపై ప్రతి ఒక్కరికి అవగాహన వచ్చేలా ఎక్కడికిక్కడ పెద్దపెద్ద ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేస్తూ ఉండడం చూస్తూ ఉన్నామ్. అయినప్పటికీ వాహనదారుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు.


 డ్రైవింగ్ చేసే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి.. ఎన్నో ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఒకరు చేసిన తప్పు కారణంగా ఇంకొకరు రోడ్డు ప్రమాదం పారిన పడుతూ చివరికి ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇలా రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ట్రాఫిక్ పోలీసులు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ.. వాహనదారుల నిర్లక్ష్యం కారణంగా ప్రయోజనం లేకుండా పోతుంది అని చెప్పాలి. అయితే ఈ మధ్యకాలంలో ఘోర రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే.


 ఇక ఎప్పుడు కూడా గగుర్పాటుకు గురి చేసే.. ఒక రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోయింది. ఈ వీడియో చూస్తుంటేనే ఏకంగా వెన్నులో వణుకు పుడుతుంది. ఒక్కొక్క క్షణం అటు ఇటు అయినా ఘోర ప్రమాదం జరిగేది. ఎంతో మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. అదృష్టవశాత్తు తృటిలో ప్రమాదం తప్పింది. ఆదిలాబాద్ జిల్లా నేరేడు కొండ మండలం నిర్మల్ ఎక్స్ రోడ్ వద్ద ఘోర ప్రమాదం తప్పింది. 44వ జాతీయ రహదారిలో క్రాసింగ్ వద్ద ఒక ఆర్టిసి బస్సు రైట్ టర్న్ తీసుకుంది. ఆ సమయం లో హైవేపై వేగంగా దూసుకొస్తున్న లారీ.. దాదాపు బస్సులు ఢీ కొట్టినట్లు కనిపించింది. అయితే లారీ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి వాహనాన్ని కంట్రోల్ చేయడంతో బస్సు వెనక స్వల్పంగా తాకింది. ఒక్క క్షణం ఆలస్యమైన కూడా అటు ఘోర ప్రమాదం జరిగి ఉండేది. దాదాపు పదుల సంఖ్యలో మరణాలు సంభవించేవి అన్నది ఈ ఘటన చూస్తే అర్థమవుతుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: