సభ్య సమాజంలో ప్రతి ఒక్కరు కూడా రాత్రి సమయంలో హాయిగా నిద్రపోగలుగుతున్నారు అంటే అందుకు కారణం దేశ సరిహద్దుల్లో పహారా కాస్తున్న సైనికులు ఎంతైతే కారణమో.. ఇక దేశ నడిబొడ్డులో అటు నేరాలను అరికడుతూ అనుక్షణం పనిచేసే ఖాకీలు కూడా అంతే కారణం అని చెప్పాలి. పోలీసులు ఉన్నారు అని ధీమాతోనే ఎంతోమంది ఇక ప్రతిరోజు కూడా హాయిగా నిద్రపోగలుగుతున్నారు. ఒకవేళ పోలీసు వస్తే లేకపోతే నేటి రోజుల్లో నేరాలు ఎంత దారుణంగా పెరిగిపోయేవో.


 అయితే సినిమాలలో పోలీస్ పాత్రలు ఎంతో పవర్ఫుల్ గా ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఏకంగా నేరస్తులను చూస్తే చాలు పూనకం వచ్చినట్లుగా ఊగిపోతూ ఉంటారు. ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు ఏకంగా ప్రాణాలను పణంగా పెట్టి సాహసాలు చేసి మరి నేరస్తులను పట్టుకోవడం చేస్తూ ఉంటారు కొంతమంది. ఏకంగా ఈ నేరస్తులను పట్టుకునే క్రమంలో ప్రాణాలు కూడా వదులుతూ ఉంటారు. అయితే సినిమాలో ఇలాంటి సన్నివేశాలను చూసినప్పుడు రియల్ లైఫ్ లో మాత్రం ఇలాంటి రిస్కులు చేసే పోలీసులు ఉండడం చాలా కష్టమే అనే భావన కొంతమంది కలుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఇలాంటి ఒక డేర్ అండ్ డాషింగ్ పోలీస్ గురించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


 కర్ణాటకలో ఒక నేరస్తుడిని పట్టుకునేందుకు కానిస్టేబుల్ చేసిన సాహసం అందరి చేత శభాష్ అనిపిస్తుంది. కరుడు గట్టిన నేరస్తుడిని పట్టుకోవడానికి.. తన ప్రాణాలను సైతం ఫణంగా పెట్టాడు కానిస్టేబుల్. సదాశివా నగర్ పోలీస్ జంక్షన్ సమీపంలో బైక్ ఫై వెళ్తున్న నేరస్తుడిని దూరం నుంచి చూసిన కానిస్టేబుల్ పరిగెత్తుకుంటూ వెళ్లి అతనికి అడ్డుపడ్డాడు. అయితే సదరు నేరస్థుడు తప్పించుకోవడానికి ప్రయత్నించగా ప్రాణాలను పణంగా పెట్టి ఏకంగా బైక్ ను వెంబడించి మరీ పట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోవడంతో.. ఇక నేరస్తుని పట్టుకునేందుకు ఇంతటి సాహసం చేసిన కానిస్టేబుల్ ఫై అందరూ ప్రశంసలు కనిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: