పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రత్యేకమైన ఘట్టం అన్న విషయం తెలిసిందే. ఇక పెళ్లీడుకు వచ్చిన యువతి యువకులు ఇద్దరు కూడా వివాహం విషయంలో కోటి ఆశలను పెట్టుకుంటూ ఉంటారు. ఆకాశం నుంచి రెక్కల గుర్రంపై వచ్చే రాకుమారుడు తమను పెళ్లి చేసుకుంటాడని అమ్మాయిలు కలలు కంటే.. ఇక తమను అర్థం చేసుకుని సంతోషంగా చూసుకునే అమ్మాయి జీవిత భాగస్వామిగా వస్తుందని అబ్బాయిలు ఆశలు పెట్టుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే కొంతమంది ప్రేమ వివాహం చేసుకుంటే ఇంకొంతమంది పెద్దలు కుదిర్చిన  వివాహం చేసుకుంటూ ఉంటారు.


 పెళ్లి సమయంలో వధూవరులు ఇద్దరు గురించి కూడా వెనక ముందు అన్ని విషయాలు తెలుసుకుని.. వైవాహిక బంధం లోకి అడుగుపెట్టడం చూస్తూ ఉంటాము అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే పెళ్లంటే నూరేళ్లపంట.. ఏ చిన్న పొరపాటు జరిగిన కూడా జీవితమే నాశనం అవుతుంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా పెళ్లి విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో మాత్రం కొంతమంది పేరెంట్స్ ఏకంగా డబ్బు ఉంది అనే కారణంతో పాతికేళ్లు కూడా నిండని తమ కూతురుని 40 ఏళ్లకు పైబడిన వారికి ఇచ్చి బలవంతంగా పెళ్లి చేయడం లాంటి ఘటనలు కూడా చూస్తూ ఉన్నాం.


 ఇక్కడ ఇలాంటిదే జరిగింది పెళ్ళికొడుకు వయస్సు ఎంత ఉంటుంది అన్న విషయాన్ని దాచి తమ కూతురికి పెళ్లి చేశారు తల్లిదండ్రులు. ఈ క్రమంలోనే పెళ్లి సమయంలో కూడా వధువరులు ఇద్దరికీ కూడా పూలదండతో ముసుగు వేసినట్లుగా ఒక బుర్కా వేసి పెళ్లి చేశారు. ఆ తర్వాత ఇతరు ఒకరి ముఖం ఒకరు చూసుకునే సమయం రానే వచ్చింది. ఈ క్రమంలోనే వధువు ముందు  ముసుగు తీసి వరుడుని చూస్తుంది. ఇక ఆ తర్వాత వరుడుకి ఉన్న ముసుగు కూడా తీయగా 20 ఏళ్ల పెళ్లికూతురు ఏకంగా 69 ఏళ్ల వరుడు ముఖం చూసి ఒక్కసారిగా షాక్ అయింది. దీంతో గట్టిగా అరుస్తూ మూర్చ పోయింది. ఇక ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: