ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బ్రెజిల్ దేశంలో ఉన్న సావో పాలలోని విన్ హెడ్ లో ప్రయాణికులతో వెళ్తున్న వ్యూపాస్ ఎయిర్ లైన్స్ విమానమే ఈ ప్రమాదానికి గురైంది. ఒక్కసారిగా... కుప్పకూలి 62 మంది మరణించడం జరిగింది. పాలో అని అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకునే ముందు... ఈ సంఘటన జరిగింది. విమానం యొక్క.. సాంకేతిక లోపం కారణంగా... గింగిరాలు తిరుగుతూ... ఇండ్ల మధ్య కుప్ప కూలింది ఈ విమానం.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు అలాగే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడం జరిగింది. ఈ విమానం కింద కుప్పకూరడంతో అక్కడ దట్టమైన పొగలు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా విమానంలో ఉన్న ప్రయాణికులంతా మరణించగా... విమానం కుప్పకూలడం వల్ల కొన్ని ఇండ్లు కూడా ధ్వంసం అయ్యాయి అంట.
అయితే ఆ ఇంటిలో ఉన్న జనాలకు ఎక్కడ కూడా ప్రమాదం జరగలేదని వార్తలు వస్తున్నాయి. ఇక దీనిపై... బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ లూలా డసిల్వా సంతాపం వ్యక్తం చేయడం జరిగింది. ఈ విమాన ప్రమాదంలో మరణించిన వారికి ఒక నిమిషం పాటు నివాళులు అర్పించారు. అలా గే ఈ విమాన ప్రమాదం పై విచారణ చేయాలని అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చారు బ్రెజిల్ అధ్యక్షులు. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. మరి ఈ ప్రమాదానికి వెనుక ఉన్న వారు ఎవరూ.. దానికి గల కారణాలు అధికారులు విచారణ చేయబోతున్నారు.