సాధారణంగా పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రత్యేకమైన ఘట్టం అన్న విషయం తెలిసిందే. పెళ్లీడుకొచ్చిన యువతీ యువకులు ఇద్దరు కూడా వారి వారి వివాహంపై కోటి ఆశలు పెట్టుకుంటూ ఉంటారు. అర్థం చేసుకునే యువతి జీవిత భాగస్వామిగా రావాలని అబ్బాయిలు.. రాకుమారుడు లాంటి అబ్బాయి భర్తగా వస్తే బాగుండు అని అమ్మాయిలు కోరుకుంటూ ఉంటారూ అని చెప్పాలి. అంతేకాదు వివాహ తంతు జీవితాంతం గుర్తుండిపోయే విధంగా ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించాలి అని అనుకుంటూ ఉంటారు.

 అయితే ఇలా వివాహం జరుగుతున్న సమయంలో వరుడు వధువుతో మాట్లాడాలి అనుకున్నప్పుడు ఎక్కువ పరిచయం ఉన్న అమ్మాయితో మాట్లాడినట్లుగా కాకుండా ఎంతో ఆచీ తుంచి మాట్లాడటం చేస్తూ ఉంటారు. ఎక్కడ మాట తుల్లకుండా జాగ్రత్త పడుతూ ఉంటాడు. కానీ ఇక్కడ ఒక వరుడు మాత్రం తన నోటి దూల కారణంగా పెళ్లయిన వెంటనే విడాకులు తీసుకునే పరిస్థితి వచ్చింది. ఏకంగా భర్త నోటి దూల కారణంగా మొదటి రాత్రి అతనికి చివరి రాత్రిగా మారిపోయింది.


 తనకు తాగుడు అలవాటు ఉందని గతంలో చాలామంది బాయ్ ఫ్రెండ్స్ ఉండేవారని.. రాత్రులు క్లబ్ లోకి వెళ్లే దానిని భార్య చెప్పింది. అయితే ఆమెకు ఈ అలవాట్లు లేవు   కానీ ఇలా చెప్తే తన భర్త కూడా నిజాలు చెప్తాడేమో అని చీకట్లో ఒక రాయేసింది. ఇంకేముంది భార్య ఇంత ఓపెన్ అయిన తర్వాత తాను కూడా మొత్తం చెప్పేయాలి అనుకున్నాడు వరుడు. ఇక సత్యహరిశ్చంద్రుడి లాగా తనకు కూడా ఇలాంటి చాలా అలవాట్లు ఉన్నాయని చెప్పేశాడు. దీంతో అసలు నిజ స్వరూపం ఇదా అంటూ షాక్ అయిన అమ్మాయి చెంప చెల్లుమనిపించింది. దీంతో మొదటి రాత్రి రోజే తనకు విడాకులు కావాలి అంటూ అరిచి గోల చేసింది. వెంటనే గదిలో నుంచి బయటికి వెళ్లి అత్తమామలకు తల్లిదండ్రులకు మ్యాటర్ చెప్పింది. అంతేకాదు విడాకులు కావాలి అంటూపుట్టింటికి వెళ్ళిపోయింది. ఇక ఈ విషయం ఆ నోట ఈ నోట పడి చివరికి సోషల్ మీడియా వరకు వచ్చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: