ఇళ్లలో వంట చేసేటప్పుడు చాలా ఉపయోగపడే పాత్ర
ప్రెషర్ కుక్కర్. ఇందులో కూరగాయల వంటివి చాలా త్వరగా ఉడుకుతాయి. దీనివల్ల టైమ్‌, గ్యాస్, మనీ సేవ్ అవుతాయి. కానీ, ప్రతిదీ ప్రెషర్ కుక్కర్‌లో వండొచ్చు అనుకోవడం తప్పు. కొన్ని రకాల ఆహార పదార్థాలను ప్రెషర్ కుక్కర్‌లో కుక్ చేస్తే కుక్కర్ పాడైపోయే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా, అవి అస్సలు రుచిగా ఉండవు. పైపెచ్చు అవి ఆరోగ్యానికి చాలా చేటు చేస్తాయి. మరి, ప్రెషర్ కుక్కర్‌లో ఏం వండకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

• చేప:

చేప చాలా మృదువైనది. దీన్ని ప్రెషర్ కుక్కర్‌లో కుక్ చేస్తే ఎక్కువ వేడి వల్ల చేప అతిగా ఉడుకుతుంది. అంతేకాకుండా, చేపలో ఉండే మంచి కొవ్వులు కూడా నశించిపోతాయి. మరీ ద్రావణంగా చేప తయారయ్యా ప్రమాదం ఉంది. అందుకే చేపను సాధారణ పాత్రలో వండుకోవడం మంచిది.

• పాలకూర:

పాలకూరలో చాలా పోషకాలు ఉంటాయి. దీన్ని ప్రెషర్ కుక్కర్‌లో వండినట్లయితే ఆ పోషకాలు అన్ని నశించిపోతాయి. అంతేకాకుండా, పాలకూర నురగలా మారిపోతుంది. దీని ఫలితంగా శరీరంలో రాళ్ళు ఏర్పడే ప్రమాదం ఉంది.

పిస్తా

పిస్తాను ప్రెషర్ కుక్కర్‌లో వండకూడదు. దీనివల్ల మనం అందులోని పోషకాలు కోల్పోవడమే కాకుండా  అదనపు కొవ్వును శరీరంలోకి ఆహ్వానించినట్లే అవుతుంది. కాబట్టి, పిస్తాను మాములు పాత్రలో మరిగించి తీసుకోవడం మంచిది.

కూరగాయలు

కూరగాయల్లో చాలా విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. వీటిని కుక్కర్‌లో ప్రిపేర్ చేయడం వల్ల అందులోని పోషకాలు డిస్ట్రాయ్ అవుతాయి. అంతేకాకుండా, కూరగాయలు తాజాదనం కోల్పోతాయి. అందుకే కూరగాయలను, ముఖ్యంగా ఆకుకూరలను సాధారణ పాత్రలో కుక్ చేయకపోవడమే మంచిది.

బంగాళాదుంపలు

బంగాళాదుంపలను కుక్కర్‌లో కుక్ చేసినట్లయితే వాటిలో ఉండే పిండి పదార్థం తగ్గిపోతుంది. అంతేకాకుండా, శరీరానికి హాని కలిగించే కొన్ని రకాల పదార్థాలు పెరుగుతాయి. అందుకే బంగాళాదుంపలను ప్రెషర్ కుక్కర్‌లో వండరాదు.

అన్నం

అన్నాన్ని ప్రెషర్ కుక్కర్‌లో వండుకుంటే శరీరంలో కొవ్వు పెరగడానికి దోహదపడుతుంది. అంతేకాకుండా, హాని కలిగించే కొన్ని రకాల రసాయనాలు కూడా ఏర్పడతాయి. అందుకే అన్నాన్ని ఆవిరి మీద లేదా సాధారణ పాత్రలో వండుకోవడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: