ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా దొంగలు బెడద ఎంతలా ఎక్కువైపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉద్యోగం చేసి నెల అంతా కష్టపడి ఇక ఒకటో తారీకు జీతం తీసుకోవడం కంటే.. వ్యాపారం చేసి లాభనష్టాలను చూసి టెన్షన్ పడటం కంటే.. ఇక ఒక రోజు కష్టపడి దొంగతనం చేస్తే చాలు అందని కాడికి దోచుకుని జల్సాలు చేయవచ్చని.. నేటి రోజుల్లో కొంతమంది జనాలు ఆలోచిస్తున్నారు. ఇక ఇలాంటి నీచమైన ఆలోచనతోనే చోరీలకు పాల్పడుతున్నారు అని చెప్పాలి. ఇక ఇలా చోరీలు చేయడంలో కూడా ఒక్కొక్కరు ఒక్కో స్టైల్ ఫాలో అవుతున్నారు. కొంతమంది ఇళ్లల్లో చోరీలు చేస్తుంటే.. కొంతమంది ఇంటి బయట పార్క్ చేసి ఉన్న బండ్లను ఎత్తుకెళ్తున్నారు.


 మరికొంతమంది బ్యాంకులను లూటీ చేస్తుంటే.. ఇంకొంతమంది ఏకంగా దారి దోపిడీలకు పాల్పడుతూ అందిన కాడికి దోచుకుంటున్నారు. ఇక ఇలాంటి తరహా ఘటనలు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూనే ఉన్నాయి అన్న విషయం తెలిసిందే.  అయితే ఇలాంటి దొంగల ఆట కట్టించేందుకు పోలీసులు ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు నిఘా ఏర్పాటు చేసినప్పటికీ ఇలా చోరీలకు పాల్పడేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త దారులను వెతుక్కుంటున్నారు ఎంతోమంది నేరస్తులు. ఇక ఈ మధ్యకాలంలో అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో కొన్ని కొన్ని దొంగతనాలకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి. ఇప్పుడు ఇలాంటి ఒక వీడియోనే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.



 సాధారణంగా ఎంతో మంది గుడిలో దొంగతనం చేసేందుకు భయపడతారు. ఎందుకంటే దేవుడు ఆగ్రహిస్తే తమ పని అయిపోతుందని అనుకుంటారు. కానీ ఇక్కడ ఒక దొంగ గుడిలోనే దొంగతనం చేసేందుకు వెళ్లాడు. అయితే ఇలా చోరీ చేసేందుకు గుడిలోకి ప్రవేశించిన దొంగ దేవుడిని మొక్కి క్షమించు దేవుడా అంటూ దొంగతనం చేసిన వీడియో వైరల్ గా మారింది  మధ్యప్రదేశ్లోని గుణాలో ఉన్న హనుమాన్ ఆలయంలోఇలాంటి చోరీ జరిగింది. గుడిలోకి ప్రవేశించిన దొంగ ముందుగా క్షమించు స్వామి అని దేవుడిని వేడుకున్నాడు. ఆ తర్వాత హనుమంతుడు విగ్రహం పై ఉన్న వెండి ఆభరణాలు ఇతర వస్తువులను దొంగలించుకొని పోయాడు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డు అయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగను పట్టుకునే పనిలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vir