బాయ్‌ఫ్రెండ్ గర్ల్‌ఫ్రెండ్ అంతే ఎన్నో గొడవలు వస్తుంటాయి. వీళ్లు చాలా సిల్లీ విషయాలకు కూడా తగువులు పెట్టుకుంటారు ఆ తర్వాత మళ్లీ ఒకటి అవుతారు అనుకోండి. అయితే ఇటీవల ఒక తనకు, తన బాయ్ ఫ్రెండ్ కి ఎవరూ ఫేస్ చేయని ఒక ప్రాబ్లం వచ్చిందని సోషల్ మీడియాలో తెలిపింది. ఆమె ఇంట్లో స్నానం చేస్తుండగా, బాయ్‌ఫ్రెండ్ ఆమెపై అనవసరంగా గొడవ చేశాడట. కారణం ఏంటంటే, తాను 26 నిమిషాలు స్నానం చేయడమేనట, దానివల్ల చాలా నీరు వృథా ఆయన పెద్ద గొడవ చేస్తున్నాడని గర్ల్ ఫ్రెండ్ వాపోతోంది.

ఆమె తన జుట్టు చాలా పొడవుగా, దట్టంగా ఉంటుందని చెప్పింది. అందుకే శరీరం అంతా కడిగేందుకు, ముఖం కడుక్కోవడానికి, జుట్టుకు కండిషనర్ వేయడానికి, షేవింగ్ చాలా సమయం పడుతుందని చెప్పింది. కానీ ఆమె బాయ్‌ఫ్రెండ్‌కి ఈ విషయం నచ్చలేదు. ఆమె ఎందుకు ఇంత సమయం స్నానం చేస్తుందని ప్రియుడు కోపంగా అడిగారట.

"నేను స్నానం చేస్తున్నప్పుడు చాలా సేపు పడుతుందని నా భాగస్వామి చాలా కోపంగా ఉన్నారు. నాకు పొడవాటి, దట్టమైన జుట్టు ఉంటుంది కాబట్టి నేను శరీరం అంతా కడిగేందుకు, జుట్టుకు కండిషనర్ వేయడానికి, షేవింగ్, ముఖం కడుక్కోవడానికి చాలా సమయం పడుతుంది. నేను స్నానం చేస్తున్నంత సేపు సింక్‌లో నీళ్లు వృథా అవుతున్నాయని నా లవర్ అన్నారు. ఎంత నీరు వృథా అవుతుందో తెలుసా నీకు అని కూడా అడిగారు. నేను స్నానం చేస్తున్నప్పుడు నాకు అది ఎలా తెలుస్తుందని నేను అడిగాను. అప్పుడు ఆయన, ‘అదే నా ఉద్దేశం’ అని చెప్పారు. అంతేకాకుండా ఇంకా చాలా విషయాలు అన్నారు."

"నేను స్నానం చేస్తున్నప్పుడు విన్న పాటలన్నీ కలిపి ఒక ప్లేలిస్ట్ చేశాను. అది చూస్తే నేను 26 నిమిషాలు స్నానం చేశానని తెలుస్తుంది" అని ఆమె రెడిట్‌లో రాసింది. "నేను ఇలా ఎక్కువసేపు స్నానం చేయడానికి కారణం 3-4 రోజులకు ఒకసారి మాత్రమే చేస్తాను." అని ఆమె చెప్పింది. "ఇంటి నుంచి పని చేస్తున్నందున నేను రోజూ స్నానం చేయను, కానీ చేసినప్పుడు శరీరం అంతా కడిగేందుకు, జుట్టుకు షాంపూ వేయడానికి 10 నిమిషాలు కంటే ఎక్కువ సమయం పట్టదు అని కూడా ఆమె చెప్పింది.

ఆమె పోస్ట్‌కు 10,000 కంటే ఎక్కువ లైక్‌లు వచ్చాయి. నీరు వృథా చేస్తున్నది మీరే అని అనుకుంటున్నాడు, కానీ ఆయన సింక్‌లో నీళ్లు వృథా చేశాడు. ఇంతకంటే దుర్మార్గపు నీటి వృథా ఎక్కడా జరగదు" అని ఒక యూజర్ కామెంట్ చేశారు. "ఇంతసేపు స్నానం చేసినంత మాత్రాన  పోయేదేముంది నీ ప్రియుడికి ఏమైనా మతిపోయిందా?" అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. వాటర్ బిల్ ఎక్కువ అవుతుందని ప్రియుడు గొడవ పెట్టుకుంటున్నాడు ఏమో అని మరి కొంతమంది అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: