సాధారణంగా సభ్య సమాజంలో శాంతిభద్రతలను నెలకొల్పేందుకు పోలీసులు ఎప్పుడు పని చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే నేరాలను అరికట్టడంలో ఎప్పుడు బిజీగా ఉంటారు. కొన్ని కొన్ని సార్లు నేరస్తులు అత్యుత్సాహం ప్రదర్శిస్తే పోలీసులు ధైర్య సాహసాలను ప్రదర్శించి.. ఇక వారిని కంట్రోల్ చేయడం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక పరిస్థితి అదుపు తప్పుతుంది అనుకుంటున్న సమయంలో నేరస్తులను అదుపు చేసేందుకు పోలీసులకు ఏకంగా తుపాకుల రూపంలో ఆయుధాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. చాలా తక్కువ సమయాల్లో మాత్రమే పోలీసులు తమ వద్ద ఉన్న తుపాకులకు పని చెప్తూ ఉంటారు.


 అయితే ఇక్కడ ఏకంగా పోలీసులపై దాడి చేయడానికి వచ్చిన ఒక వ్యక్తిపై పోలీసులు కాల్పులు జరిపిన వీడియో ఒకటి వైరల్ గా మారిపోయింది. కాలిఫోర్నియాలో ఈ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. 41 ఏళ్ళ జోసెఫ్ బ్రాండెడ్ విల్ తన తల్లిదండ్రులను దారుణంగా తల నరికి చంపేశాడు. ఈ క్రమంలోనే ఇలా హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అయితే ఇలా తల్లిదండ్రులను చంపి ఆ ఫోటోలని పోలీసులకు పంపగా.. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇక అతను ఉన్న చోటుకి చేరుకున్నారు. ఈ క్రమంలోనే అక్కడికి చేరుకున్న అధికారులపై దాడి చేయడానికి ప్రయత్నించాడు సదరు వ్యక్తి.


 ఏకంగా తన చేతిలో ఉన్న మెటల్ వస్తువులతో పోలీసులపై దాడి చేయడానికి వేగంగా దూసుకు వచ్చాడు. ఈ క్రమంలోనే అప్రమత్తమైన పోలీసులు తమ చేతిలో ఉన్న తుపాకీ కి పని చెప్పారు. ఏకంగా నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. దీంతో ఈ కాల్పుల్లో గాయపడ్డ నిందితుడు ఒక్కసారిగా రోడ్డుపై కుప్పకూలిపోయాడు. ఇక తర్వాత అధికారులు అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా.. ఏకంగా పోలీసుల ముందే పాటలు పాడటం ప్రారంభించారు. ఈ క్రమంలోనే అతన్ని మరికొన్ని రోజుల్లో పోలీసులు కోర్టులో హాజరుపరచబోతున్నారు. కాగా ఇలా పోలీసులు కాల్పులు జరిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: